For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Samantha :సమంతకు ఇంకా మయోసైటిస్ తగ్గలేదు .... చికిత్స కోసం కొన్నాళ్ల పాటు అమెరికాలోనే.. అందుకే సినిమాలకి బ్రేక్ .

02:07 PM Jul 05, 2023 IST | Sowmya
Updated At - 02:07 PM Jul 05, 2023 IST
samantha  సమంతకు ఇంకా మయోసైటిస్  తగ్గలేదు      చికిత్స కోసం కొన్నాళ్ల పాటు అమెరికాలోనే   అందుకే సినిమాలకి బ్రేక్
Advertisement

Samantha : సమంత చేస్తున్న ఖుషి సినిమా, సిటాడెల్ షూటింగ్స్ పూర్తవ్వడంతో సమంత కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. కొత్త సినిమాలు కూడా ఇప్పట్లో ఒప్పుకోదని, ఆల్రెడీ చేతిలో ఉన్న ప్రాజెక్టులకు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నట్టు సమాచారం. ఒక సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని సమంత చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది.

అయితే సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. సమంత గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దాని చికిత్స కోసం కూడా కొన్నాళ్ల క్రితం ఒక ఆరు నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంది. మెడిసిన్స్ తో పాటు కేరళ ఆయుర్వేదం కూడా సమంత వాడినట్టు సమాచారం. అయితే సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం సమంతకు ఇంకా మయోసైటిస్ పూర్తిగా  తగ్గలేదని తెలుస్తోంది.

Advertisement GKSC

మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదని, ఇంకా బాధపడుతుందని, త్వరలో అమెరికాకు ఈ చికిత్స కోసం సమంత వెళ్ళబోతున్నట్టు, కొన్నాళ్ల పాటు అమెరికాలోనే ఉండి సమంత మయోసైటిస్ కి పూర్తి చికిత్స తీసుకుంటుందని, సమంత పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ ఇండియాకు వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. అలాగే చికిత్స కొరకు సమంత సౌత్ కొరియాకు కూడా వెళ్తుందని పలువురు చెప్తున్నారు. అందుకే సినిమాలకు సమంత దాదాపు ఒక సంవత్సరం బ్రేక్ ప్రకటించిందని సమాచారం. దీంతో సమంత అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళీ సినిమాల్లోకి రావాలని  ఎంతగానో కోరుకుంటున్నారు అభిమానులు.

Advertisement
Author Image