For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Gangs of Godavari :గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీస్ .. పూర్తి లిరికల్ సాంగ్ కి ఏర్పాటులు ...

11:41 AM Aug 15, 2023 IST | Sowmya
Updated At - 11:41 AM Aug 15, 2023 IST
gangs of godavari  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీస్    పూర్తి లిరికల్ సాంగ్ కి ఏర్పాటులు
Advertisement

Gangs of Godavari : విశ్వక్‌సేన్ ఇటీవల దాస్ కా ధ‌మ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన నెక్స్ట్ సినిమా కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచాడు. అంజలి, నేహశెట్టి ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గ్లింప్స్ లో.. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ తో అదరగొట్టాడు. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో విశ్వక్ ఒక కొత్త లుక్ లో కనిపించనున్నాడు . ఫుల్ మాస్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు .

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ పాట సుట్టంలా సూసి సాంగ్ ప్రోమోని నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా.. అని ఈ పాట సాగనుంది. విశ్వక్, నేహా శెట్టి మధ్య ఈ పాట ఉండనుంది. పల్లెటూళ్ళో జరిగే ఓ ప్రేమకథలా కనిపిస్తుంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా రేపు ఆగస్టు 16న పూర్తి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు . ఈ లిరికల్ సాంగ్ రిలీస్ కి కావాల్సిన అన్ని పనులు పూర్తి అయ్యాయి .ఇక ఈ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Advertisement GKSC

Advertisement
Author Image