For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Dhanush: ధనుష్‌పై నిషేధం.... సమాధానం ఇవ్వకపోతే రెడ్ కార్డ్ జారీ....

08:45 AM Jul 03, 2023 IST | Sowmya
Updated At - 08:45 AM Jul 03, 2023 IST
dhanush  ధనుష్‌పై నిషేధం     సమాధానం ఇవ్వకపోతే  రెడ్ కార్డ్ జారీ
Advertisement

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. అయితే ఒక్క తమిళ్‌లోనే కాక బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఆయనకు అభిమానులున్నారు. మొట్టమొదటిసారి తెలుగులో ధనుష్ చేసిన స్ట్రెయిట్ ఫిల్మ్ ‘సార్’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటిస్తుండగా.. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీలో పలు సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్‌పై నిషేధం విధించడానికి ‘తమిళ్‌నాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC)’ సిద్ధమవుతున్నట్లు టాక్. తేనేండాళ్ ఫిలింస్ (Sri Thenandal Films) ఇచ్చిన ఫిర్యాదే ఇందుకు కారణమని సమాచారం.

విషయానికొస్తే.. ధనుష్ తన దర్శకత్వంలో రెండో సినిమాను శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సైన్ చేయగా... 2017లోనే అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే, తేనాండళ్ ఫిల్మ్స్ ఇంతకాలం వెయిట్ చేసినప్పటికీ ధనుష్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో సదరు నిర్మాతలు రీసెంట్‌గా తమిళనాడు నిర్మాతల మండలిని ఆశ్రయించి సమస్యను వివరించారు. ఈ మేరకు తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఈ సంఘటనపై ధనుష్‌కు నోటీసులు జారీ చేసి వివరణ కోరనుంది. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే రెడ్ కార్డ్ జారీ చేసే యోచనలో ఉన్నట్లు న్యూస్ వినిపిస్తోంది.

Advertisement GKSC

అయితే కోలీవుడ్‌లో స్టార్ హీరోలు, నటులపై నిర్మాతల మండలి రెడ్ కార్డ్ జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే హీరో విశాల్, శింబు, ఎస్‌జే సూర్యకు సైతం ఇలాంటి ఘటనే ఎదురైంది.   ఇక ధనుష్‌‌కు సైతం ప్రొడక్షన్‌ హౌస్‌ తేనేండాళ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కమిట్‌మెంట్ ఉంది కానీ స్పందించడం లేదు. దీంతో అతనిపైనా రెడ్ కార్డ్‌ జారీ చేసే పరిస్థితులు తలెత్తాయి. మరి దీనిపై ధనుష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Advertisement
Author Image