For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Baby Trailer:బేబీ ట్రైలర్ రిలీస్ .. ట్రైలర్ లవ్ ఫెయిల్యూర్ కుర్రాల్ని మరింత ఆకట్టుకునేలా...

09:09 AM Jul 08, 2023 IST | Sowmya
Updated At - 09:09 AM Jul 08, 2023 IST
baby trailer బేబీ ట్రైలర్ రిలీస్    ట్రైలర్ లవ్ ఫెయిల్యూర్ కుర్రాల్ని  మరింత ఆకట్టుకునేలా
Advertisement

Baby Trailer : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బేబీ’. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతీ, నిర్మాత SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2020 లో వచ్చిన కలర్ ఫోటో సినిమాకి కథని అందించిన సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కథ మొత్తం వైష్ణవి చైతన్య చుట్టూ తిరగనుంది. టీజర్ చూసిన దాన్నిబట్టి అర్ధమైంది ఏంటంటే.. స్కూల్ లో ఒక అబ్బాయిని ప్రేమించిన హీరోయిన్.. కాలేజీకి వెళ్ళాక అక్కడ మరో వ్యక్తిని కూడా ప్రేమలోకి దించుతుంది. ఆ ఇద్దరు అబ్బాయి హీరోయిన్ని  ట్రూగా ప్రేమిస్తారు. ప్రస్తుతం నిజ జీవితంలో జరుగుతున్న కథలనే ఆధారంగా తీసుకునే దర్శకుడు సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

Advertisement GKSC

ఇక ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అందర్నీ లవ్ ఫెయిల్యూర్ కుర్రాల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. “ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదొక సిగ్నల్ ఇస్తాడు. మరి నీలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే”, “తిరిగి కొట్టేంత బలం లేదనేగారా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకపోవచ్చు. కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవరు కొట్టలేరు” అన్న రెండు డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

Advertisement
Author Image