For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Anikha Surendran :చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ .... అప్పుడే ధనుష్ తో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అనికా ....

09:12 AM Aug 02, 2023 IST | Sowmya
Updated At - 09:12 AM Aug 02, 2023 IST
anikha surendran  చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ      అప్పుడే ధనుష్ తో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన  అనికా
Advertisement

Anikha surendran : అనికా సురేంద్రన్.. ఈమె ఒకప్పుడు మలయాళం, తమిళ్ లో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అంతే కాదు అజిత్(Ajith)ఎంతవాడు గాని, విశ్వాసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. తెలుగులో ది ఘోస్ట్ సినిమాలో కనిపించింది. బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనికా. ప్రస్తుతం మలయాళం, తమిళ్ లో పలు సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేసిన అనికా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది సౌత్ లో.

తాజాగా అనికా సురేంద్రన్ ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ధనుష్(Dhanush) త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత ధనుష్ సొంత దర్శకత్వంలో తన 50వ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అనికా సురేంద్రన్ ని ఒక మెయిన్ లీడ్ గా తీసుకున్నట్టు సమాచారం.ఇప్పుడు  తమిళ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

Advertisement GKSC

ఇటీవల అనికా మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడి నుంచి హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. దీంతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే హీరోయిన్ అయిపోయి ఏకంగా ధనుష్ తో నటించేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Author Image