For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Asin: అసిన్ జంట మద్య విడాకులు అనేది నిజమేనా .. తెలుసుకోవాలి అంటే ...

10:55 AM Jun 29, 2023 IST | Sowmya
Updated At - 10:55 AM Jun 29, 2023 IST
asin  అసిన్ జంట మద్య విడాకులు అనేది నిజమేనా    తెలుసుకోవాలి అంటే
Advertisement

Asin:తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని కథానాయిక అసిన్. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’తో తెలుగులో అడుగు పెట్టి అనేక పెద్ద సినిమాల్లో నటించిందామె. ఐతే కెరీర్ ఇంకా కొనసాగుతుండగానే ఈ మలయాళ కుట్టి మైక్రోమ్యాక్స్ మొబైల్ కంపెనీ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడటం.. అతణ్ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడటం తెలిసిందే.

2016లో ఈ జంట పెళ్లి చేసుకున్నాక అసిన్ లైమ్ లైట్లో లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు విడాకుల ప్రచారంతో అసిన్ వార్తల్లోకి వచ్చింది అసిన్. తన భర్తతో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి అసిన్ తొలగించడం ఈ ప్రచారానికి దారి తీసింది. ఐతే తాను విడాకులు తీసుకోబోతున్న వార్త నిజం కాదని అసిన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.

Advertisement GKSC

‘‘వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న సమయంలో కొన్ని నిరాధారమైన వార్తలు మా కంట పడ్డాయి. వాటిని చూశాక.. పెళ్లి కోసం ఇద్దరి కుటుంబాల పెద్దలను ఒప్పించిన రోజులు గుర్తుకు వచ్చాయి. మేం విడిపోతున్నామంటూ వచ్చిన వార్త్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి కాస్త ఆలోచించి వార్తలు రాయండి. అద్భుతమైన హాలిడేలో ఇలాంటి వాటి కోసం ఐదు నిమిషాలు వృథా చేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా’’ అని అసిన్ తెలిపింది.

‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తర్వాత అసిన్.. తెలుగులో నాగార్జున సరసన ‘శివమణి’.. వెంకటేష్‌కు జోడీగా ‘ఘర్షణ’.. బాలకృష్ణ సరసన ‘లక్ష్మీ నరసింహా’ లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో ఆమె చేసిన ‘గజినీ’; ‘పోకిరి’ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. హిందీలో సైతం ‘గజినీ’ రీమేక్ సహా పలు భారీ చిత్రాల్లో అసిన్ నటించింది. చివరగా ఆమె ‘హౌస్ ఫుల్-2’, ‘లండన్ డ్రీమ్స్’ చిత్రాల్లో మెరిసింది.

Advertisement
Author Image