For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఫేమస్ క్లాత్ బ్రాండ్ ట్విల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి

08:44 PM Aug 12, 2023 IST | Sowmya
Updated At - 08:44 PM Aug 12, 2023 IST
ఫేమస్ క్లాత్ బ్రాండ్ ట్విల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి
Advertisement

ఫేమస్ క్లాత్ బ్రాండ్ ట్విల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేయబోతున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ మేరకు ఆయనతో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. ట్విల్స్ ఎక్స్ నవీన్ పోలిశెట్టి పేరుతో కొత్త కలెక్షన్ ను ఈ సంస్థ ఇండియా వైడ్ తమ క్లాత్ స్టోర్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రీసెంట్ గా ట్విల్స్ బ్రాండ్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు నవీన్ పోలిశెట్టి.

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్నారు నవీన్ పోలిశెట్టి. ఆయన నటించిన కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు పి.మహేశ్ బాబు తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కోసం ఫిల్మ్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image