Entertainment : నా కామెడీ టైమింగ్ అంటే ఆదర్శకుడికి చాలా ఇష్టం.. నాకోసం అంత దూరం సైకిల్ పైన వచ్చాడు.. ఆలీ
Entertainment ఆలీతో సరదాగా కార్యక్రమం ఇప్పటివరకు ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఈ షో లో ఆసక్తికర విషయంలో పంచుకున్నాడు కమెడియన్ ఆలీ..
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఆలీ ఇప్పటివరకు వేయకపోయినా చిత్రాల్లో నటించారు అయితే తాజాగా ఆయన తన జీవితానికి సంబంధించి చెప్పుకొచ్చారు..
ఆలీతో సరదాగా కార్యక్రమంలో మాట్లాడిన ఆలీ.. "పూరి జగన్నాథ్ నన్ను కలవడం కోసం నర్సీపట్నం నుంచి అనకాపల్లికి వచ్చేవారు. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం షోలే సినిమా. అందులో అంజాద్‌ఖాన్ చూసి షాకయ్యా. ఆయన కోసమే వంద సార్లు చూశా. షోలే స్క్రీన్‌పై వేసి, మ్యూట్ పెట్టేస్తే.. అందరి డైలాగ్‌లు చెప్పేస్తా. అయితే నా కామెడీ అంటే పూరికి చాలా ఇష్టం. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాల్లో ప్రత్యేకంగా నాకోసం కామెడీ ట్రాక్‌లు రాశారు. నేను పని చేసిన ఎక్కువమంది దర్శకుల్లో పూరి ఒకరు.. ఎప్పటికీ అతనితో ఉన్న అనుబంధం నాకు ప్రత్యేకమే.. అలాగే దేశ ముదురు సినిమా సమయంలో స్వామీజి వేషం వేసుకుని.. వేరే స్వామీజీ పక్కన కూర్చొంటే ఆయనకు నాకూ దండం పెట్టారు. గెటప్ తీసేసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. పూరితో చేసిన రెండు సినిమాలకు నాకు రెండు ఫిల్మ్‌ఫేర్‌లు వచ్చాయి.. ఇప్పటివరకు ఎందరో సెలబ్రెటీలతో ఈ షోను నడిపించాను. ఇందులో నాకు ఎంతో ఇష్టమైన బాలసుబ్రమణ్యం అల్లు అరవింద్ పూరి జగన్నాధ రాఘవేంద్రరావు బ్రహ్మానందం ఉన్నారు.." అని అన్నారు..