BHAKTHI NEWS: శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనానికి కంటే ముందే కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.