For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana News: ట్విట్టర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో రైతుబంధు, కేసీఆర్‌ హ్యాష్‌ట్యాగ్‌ #RythuBandhuKCR ను ఉపయోగించి వేలాది ట్వీట్లు

05:10 PM Jan 11, 2022 IST | Sowmya
Updated At - 05:10 PM Jan 11, 2022 IST
telangana news  ట్విట్టర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో రైతుబంధు  కేసీఆర్‌ హ్యాష్‌ట్యాగ్‌  rythubandhukcr ను ఉపయోగించి వేలాది ట్వీట్లు
Advertisement

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం రూ.50 వేల కోట్లకు చేరింది. దీంతో సోషల్‌ మీడియాలో సోమవారం ఎక్కడ చూసినా ఇదే కనిపించింది. ట్విట్టర్‌లో వేలమంది రైతుబంధు కేసీఆర్‌ #RythuBandhuKCR హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎన్నారైలు, రైతులు రైతుబంధు కార్యక్రమాన్ని, రైతు సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో దేశంలో టాప్‌ ట్రెండింగ్‌లో రైతుబంధు కేసీఆర్‌ నిలిచింది. పలు జిల్లాల్లో రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్లు, పంట పొలాలు, సంకాంత్రి ముగ్గులతో నిర్వహించిన సంబురాల ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లు : ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు : అన్నదాతకు అండగా, రైతు సంక్షేమంలో దేశానికి స్ఫూర్తిగా, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ఇప్పటివరకు అందించిన మొత్తం రూ.50 వేల కోట్లకు చేరుకున్నది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, రైతన్నలకు శుభాకాంక్షలు.

Advertisement GKSC

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి : ఒక కన్ను అప్పుకోసం.. ఒక కన్ను వాన కోసం.. నాడు రైతుల ఎదురుచూపులు. నేడు ఒక చెయ్యి రైతుబంధు కోసం.. ఒక చెయ్యి సేద్యంకోసం.. నీళ్లకు కాళ్లొచ్చినయ్‌. నేలకు నవ్వొచ్చింది. రైతుబంధు సాయంతో బంగారు తెలంగాణ ఆవిష్కృతం అవుతున్నది.

స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ : రైతన్నకు ఆర్థిక తోడ్పాటు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి ‘రైతుబంధు’ పథకం ద్వారా నాలుగేండ్లలో రూ.50 వేల కోట్లు అందించిన సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌: అన్నదాతల కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకు రూ.50వేల కోట్లు పంపిణీ చేయడం అంటే.. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గర రోజు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు: రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తూ రైతు బాంధవుడిగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు.

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌: ఒకవైపు కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టులు.. మరోవైపు రైతుకు దన్నుగా రైతుబంధు.. రాష్ట్రంలో వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసి వందేండ్ల భవిష్యత్‌ తెలంగాణకు భరోసా ఇచ్చింది రైతుబంధు.

విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి: రైతుబంధు పథకం కింద రైతులకు నేటితో రూ.50వేల కోట్లు లబ్ధి చేకూరిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు
కృతజ్ఞతలు.

బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌: అన్నదాతకు అండగా, రైతు సంక్షేమంలో దేశానికే స్ఫూర్తిగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా అందించిన మొత్తం రూ.50వేల కోట్లకు చేరుకున్న సందర్భంగా రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రైతన్నలకు శుభాకాంక్షలు.

మైనార్టీ, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌: చరిత్ర లిఖించిన రైతుబంధు. రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ. రైతుబాంధవుడిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.CM KCR Raitubandhu Top Trending on Twitter,Thousands of hashtag tweets using the Trending,Telangana Political News,telugu golden tv,v9 news telugu,teluguworldnow.com.1ఎమ్మెల్సీ కవిత: కేసీఆర్‌ సారు చూపిన మార్గం.. సాలు పట్టిన సేద్యం.. అన్నదాత ఇంట ధనలక్ష్మి.. తెలంగాణ ధాన్యలక్ష్మి. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజుగా చేసి, నవతరాన్ని సైతం సాగువైపు మల్లించేలా స్ఫూర్తి నిచ్చింది మన సీఎం కేసీఆర్‌ సార్‌ ఇచ్చిన రైతుబంధు. బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్‌ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్న దాతలకు అందిన పంట పెట్టుబడి సాయం రూ.50 వేల కోట్లకు చేరుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.. జై తెలంగాణ.. జై కేసీఆర్‌.

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌: స్వరాష్ట్రంలో రైతు రాజయ్యాడు. సీఎం కేసీఆర్‌ దక్షతతో సాగు సంబురమైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి.. దేశానికి ఆదర్శంగా నిలిపింది రైతుబంధు పథకం.

టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ క్రిశాంక్‌: రాష్ట్రం రాకముందు దేశంలో రైతు ఆత్మహత్యల్లో మొదటి ర్యాంకులో ఉన్న తెలంగాణ, సీఎం కేసీఆర్‌ పాలనలో రైతు ఆత్మహత్యల తగ్గుదలలో మొదటి ర్యాంకు సాధించింది.

టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ పాటిమీది జగన్మోహన్‌రావు: 2018లో రైతుబంధును ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఎకరాకు రూ.10వేల సాయం దేశంలోనే అత్యధికం. ఇది కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన వరం.

Advertisement
Author Image