For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆల్-టైమ్ ఫాంటసీ క్లాసిక్ 'భైరవద్వీపం' ఆగస్ట్ 5న 4kలో రీ రిలీజ్

10:46 AM Jul 26, 2023 IST | Sowmya
Updated At - 10:46 AM Jul 26, 2023 IST
ఆల్ టైమ్ ఫాంటసీ క్లాసిక్  భైరవద్వీపం  ఆగస్ట్ 5న 4kలో రీ రిలీజ్
Advertisement

వైవిధ్యమైన కథలను స్వాగతించే నటసింహ నందమూరి బాలకృష్ణ 1993లో తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతాన్ని సృష్టించేందుకు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి పనిచేశారు. ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ‘భైరవద్వీపం’ చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించింది. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ని ఈ తరం ప్రేక్షకుల కోసం ఆగస్ట్ 5, 2023న అప్‌గ్రేడ్ చేసిన 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తోంది.

చంద్ర శేఖర్ కుమారస్వామి, క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్‌ పి.దేవ్ వర్మ ‘భైరవ ద్వీపం’ 4కె విడుదలతో ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమాటిక్ అనుభూతిని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్‌ గా ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్ కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి పద్మావతి (రోజా) తో ప్రేమలో పడతారు. ఒక దుష్ట మాంత్రికుడు  పద్మావతిని  బలి ఇవ్వడానికి 'భైరవ ద్వీపం' అనే ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకువెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి, యువరాణిని ఎలా కాపాడతాడు అనేది.. గొప్ప మలుపులతో, అద్భుతమైన దృశ్యాలతో కూడిన విజువల్ వండర్  'భైరవ ద్వీపం'.

Advertisement GKSC

రావి కొండల రావు రాసిన మ్యాజికల్ స్టోరీని దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా అద్భుతమైన స్క్రీన్‌ ప్లే ని అందించారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ . ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కబీర్ లాల్, ఎడిటింగ్ డి.రాజ గోపాల్. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటరామి రెడ్డి నిర్మాణ విలువలు ప్రతి జనరేషన్ ని ఆకట్టుకునేలా అత్యున్నత స్థాయిలో వుంటాయి. ఈ చిత్రం భారీ బాక్సాఫీస్ నంబర్లు, ప్రేక్షకుల ఆదరణతో పాటు 9 నంది అవార్డులను గెలుచుకుంది.

సినిమా వివరాలు :

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, రోజా, కైకాల సత్యనారాయణ, విజయకుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరి బాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కెఆర్ విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
కథ: రావి కొండలరావు
నిర్మాత: బి వెంకటరామి రెడ్డి
సంగీతం: మాధవపెద్ది సురేష్
సినిమాటోగ్రఫీ: కబీర్ లాల్
పీఆర్వో - వంశీ శేఖర్

Advertisement
Author Image