For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: గ్రూప్ డాన్సర్లకు ఆర్థికసాయం: శేఖర్ మాస్టర్

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
film news  గ్రూప్ డాన్సర్లకు ఆర్థికసాయం  శేఖర్ మాస్టర్
Advertisement

Choreographer Shekar Master Funding For Tollywood Group Dancers, Covid News, Corona News, Telugu Film industry,

FILM NEWS: గ్రూప్ డాన్సర్లకు ఆర్థికసాయం: శేఖర్ మాస్టర్

Advertisement GKSC

ప్రస్తుతం తెలంగాణాలో 2nd లాక్ డౌన్ వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సంస్థలు ప్రజలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

కోవిడ్ కారణంగా సినీపరిశ్రమల్లో కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సినీ కార్మికులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ సంధర్బంగా ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేసారు. ఈ కరోనా కారణంగా కొద్దిరోజులుగా డాన్సర్లకు ఎలాంటి పని లేకుండా పోయిందని, చివరకు షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడ ఆగిపోవడంతో గ్రూప్ డాన్సర్స్ పరిస్థితి కనీస ఆదాయం లేకుండా చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పూట గడవటమే కష్టంగా ఉందని అన్నారు. అందుకే అలాంటి ఇబ్బందులు పడుతున్న ఏ డాన్సర్ అయినా సరే .. క్రింద తాను ఇస్తున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి నిత్యావసరవస్తువులు అందుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న వారికి మాత్రమే సరుకులు ఇస్తున్నామని, బయట ఊళ్లలో ఉన్న వారికీ సరుకులు ఇవ్వటం సాధ్యపడటం లేదని తెలిపారు. బయట పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి కాబట్టి ఎవరూ బయట తిరగొద్దు అని పేర్కొన్నారు. ఫోన్ నెంబర్లు 9989189885, 9618961492, 7416519257కు ఇబ్బందులు పడుతున్న డాన్సర్లు ఫోన్లు చేయవచ్చని తెలిపారు.

Advertisement
Author Image