For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సంక్రాంతికి రావడం ఇంకా పెద్ద పండగ : శేఖర్ మాస్టర్

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
వాల్తేరు వీరయ్య  వీరసింహారెడ్డి సంక్రాంతికి రావడం ఇంకా పెద్ద పండగ   శేఖర్ మాస్టర్
Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, 'వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి.. 'వీరసింహారెడ్డి' చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్యలోని అన్ని పాటలకు (సింగిల్ కార్డ్) కొరియోగ్రఫీ అందించారు విజే శేఖర్ మాస్టర్. అలాగే వీరసింహారెడ్డిలోని రెండు పాటలకు (సుగుణ సుందరి, మా బావ మనోభావాలు) కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరు సమావేశంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విశేషాలని పంచుకున్నారు.

చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాంటి  ఇద్దరు పెద్ద స్టార్స్ సినిమాలకి పని చేయడం సవాల్ గా అనిపించిందా ?
పాటలు చేస్తున్నప్పుడు రెండు సినిమాలు పండక్కి వస్తాయని తెలీదు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేశాను. ఇప్పుడు రెండు సినిమాల పాటలు, లిరికల్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతుండటంతో టెన్షన్ పుడుతుంది(నవ్వుతూ). కానీ చాలా ఆనందంగా వుంది.

Advertisement GKSC

హీరోల అభిమానుల మధ్య మా హీరో మీ హీరో అని కంపారిజన్లు పెరుగుతుంటాయి కదా.. ఈ విషయంలో ఒత్తిడి ఉంటుందా ?  
అదేం లేదండీ.  ఈ ప్రాసస్ ని ఎంజాయ్ చేస్తున్నాను. సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి వస్తున్నారు. నాకైతే ఇది ఇంకా పెద్ద పండగ. వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు చేశాను. వీరసింహా రెడ్డిలో రెండు పాటలు చేశాను. చాలా అనందంగా వుంది.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Maithri movie makers Veerasimha Reddy's third single 'Ma Bava Manobhavalu' released grandly at the hands of Balayya fans,Telugu Golden TVఇద్దరు పెద్ద హీరోలతో పని చేసినప్పుడు ఎలా ప్రీపేర్ అవుతారు ?
మొదట పాటకి ఏం కావోలో దాని ప్రకారం వెళ్తాం. తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి స్టెప్స్, మూమెంట్స్ అయితే బావుంటాయో అనేది మౌల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అంతే..ఇంతకు మించి ఎక్కువ ఆలోచించినా సరిగ్గా ఫోకస్ చేయలేం.

చిరంజీవి, బాలకృష్ణ టాప్ హీరోలు, ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఈ ఇద్దరిలో వున్న యూనిక్ క్యాలిటీ ఏమిటి ?
ఇద్దరిలో వున్న యూనిక్ క్యాలిటీ డెడికేషన్. ఒక మూమెంట్ వస్తే అది పూర్తయ్యేవరకూ రిలాక్స్ అవ్వరు. ఆ డెడికేషన్ ఇద్దరిలో చూశా. అలాగే టైమింగ్ సెన్స్. వారిద్దరి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలివి.

Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Unveiled,Telugu Golden TV,telugu world news,www.teluguworldnow.comచిరంజీవి, బాలకృష్ణ గారి తో వర్కింగ్ స్టయిల్ ఎలా వుంటుంది ? మొదట కంపోజ్ చేసుకునే వెళ్తారా ?
సాంగ్ కంపోజ్ చేసుకునే వెళ్తాం. కొన్ని లొకేషన్ బట్టి కూడా కంపోజ్ చేస్తాం.  ఎక్కువగా అయితే రిహార్సల్ లోనే కంపోజ్ చేసి వెళ్తాం.

ఇలాంటి స్టెప్స్ కావాలని అడుగుతుంటారా ?
అలా ఏం వుండదండీ. కొత్తగా చేయాలని మాత్రం చెబుతుంటారు. అయితే నేను మాత్రం ఒకదానికి రెండు మూడు ఆప్షన్స్ తీసుకుని వెళ్తాను. వారి బాడీ లాంగ్వేజ్ కి ఏది బావుటుందో అది పెడతాం.

సినీయర్స్ తో పని చేయడం ఒక సవాల్ గా అనిపిస్తుందా ? అంచనాలు కూడా ఎక్కువగా వుంటాయి కదా ?
లేదండీ. వారితో పని చేయడంలో కంఫర్ట్ వుంటుంది. ఈ సమయంలోగ పూర్తి చేయాలని నిర్మాత ఒక టైం ఇస్తారు. వారు ఒకసారి వస్తే అది పూర్తయ్యేవకూ వెళ్లరు. దీంతో మాకు సమయం మిగులుతుంది. పని కూడా త్వరగా పూర్తవుతుంది. అంచనాలు మాత్రం ఎక్కువగానే వుంటాయి. వాటిని అందుకోవడానికి మేము ఎక్కువ కష్టపడాలి.

Theater Standees Of Veera Simha Reddy Readied With Nandamuri Balakrishna's Iconic Still,Gopichand Malineni,S Thaman,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comవాల్తేరు వీరయ్యలో మీకు సవాల్ గా అనిపించిన పాట ఏది ?
వాల్తేరు వీరయ్యలో ఐదు పాటలు వున్నాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. ప్రతి పాటని డిఫరెంట్ గా చేశాం.  ఈ విషయంలో కాస్త ఎక్కువగానే కష్టపడ్డాం. ఒకటి మాస్, మరొకరి క్లాస్ లో మాస్, మరొకటి ఫుల్ మెలోడి..  ఇలా చేయడానికి కొంచెం ఎక్కువ వర్క్ అవుట్ చేయాలి.

మెలోడి ఎక్కువ సవాల్ గా వుంటుంది కదా ?
అవును. అందులోనూ వాల్తేరు వీరయ్య మెలోడి పాట కోసం ఫారిన్ వెళ్లాం. అక్కడ మైనస్ 10 డిగ్రీల వద్ద పని చేశాం. థర్మల్స్, జర్కిన్స్, బూట్స్, గ్లౌజ్స్, మంకీ క్యాప్ అన్నీ వేసుకున్నప్పటికీ అక్కడ నిలబడలేం. అలాంటిది హీరో, హీరోయిన్ కి షూటింగ్ లో ఇవేవీ వుండవు. మామూలు డ్రెస్ లో వుండాలి. నడుస్తుంటేనే కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి. చేతులో ముడుచుకుపోతాయి. అలాంటింది ఆ చలిలో చిరంజీవి గారు, శ్రుతి హాసన్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. డ్యాన్సులు అద్భుతంగా వచ్చాయి.

అలాగే వీరసింహా రెడ్డి సుగుణ సుందరి పాట కోసం టర్కీ వెళ్లాం. అక్కడ ఫుల్ ఎండలు. వాల్తేరు వీరయ్య చలి అయితే  దానికి పూర్తి భిన్నంగా వీరసింహారెడ్డి సుగుణ సుందరి పాటని భయంకరమైన ఎండలో షూట్ చేశాం. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఇందులో బెల్ట్, నాడ స్టెప్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కోసం స్పెషల్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం.

Megastar Chiranjeevi and Shruti Haasan are going to Europe for the shooting of two songs of 'Waltheru Veeraiya',Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comమైత్రీ మూవీ మేకర్స్ గురించి ?
ఈ మధ్య కాలంలో మైత్రీ మూవీ మేకర్స్ లో చాలా పాటలు చేశాను. వారితో పని చేయడంలో ఒక కంఫర్ట్ వుంటుంది.  మాకు ఏది కావాలన్నా సమకూరుస్తారు. ఎక్కడా రాజీపడరు. అద్భుతమైన నిర్మాతలు.

ఈ తరంలో డ్యాన్స్ మాస్టర్లు సిగ్నేచర్ స్టెప్స్ పై ఎక్కువ ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ ట్రెండ్ ని ఎలా చూస్తారు ?
ఇప్పుడు అందరి చేతిలో ముబైల్ వుంది. రీల్స్ ఎక్కువైపోయాయి. సాంగ్ హిట్ అయ్యిందా లేదా అనేది తర్వాత.. ముందు రీల్స్ లో వచ్చే మూమెంట్ హిట్ అయితే ఆటోమేటిక్ గా దాన్ని  హిట్ చేస్తున్నారు. సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందా అనే తర్వాత సంగతి. సిగ్నేచర్ హిట్ అయితే జనాల్లోకి వెళ్లిపోతుంది. నేను కూడా మొదట నుండి సూపర్ మచ్చి, బ్లాక్ బస్టర్..లాంటి  పాటల్లో సిగ్నేచర్ ఫాలో అవుతూ వచ్చాను. ఇప్పుడు జనాల్లో ఆ ట్రెండ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు కంపల్సరిగా ఒక సిగ్నేచర్ కావాలి.

Balakrishna, Gopichand Malineni, Veera Simha Reddy Second Single Suguna Sundari’s Lyrical Video On December 15th,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comడ్యాన్స్ లో కొత్తదనం చూపించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు ?
ముందు ఒక పాటకు రెండు ముందు వెర్షన్స్ చేస్తాం. ఎక్కువ ప్రాక్టీస్ రిహర్సల్ చేస్తాం. ఇలా కాకుండా మరోలా చేస్తే ఎలా వుంటుందో చూస్తాం. దిని నుండే కొత్త కొత్త మూమెంట్స్ ఆలోచనలు వస్తాయి.

కోరియోగ్రఫీలో బీట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా ? లిరిక్స్ కా ?
ఎక్కువ బీట్ కే వుంటుంది. లిరిక్ బీట్ డామినేట్ చేస్తుంటే లిరిక్ బీట్ రెండూ పట్టుకుంటాం.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video Time Locked,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.comచాలా బిజీ కొరియోగ్రాఫర్ గా వుంటున్నారు. పెద్ద హీరోలు మీరే కావాలని అంటున్నారు .. ఎలా అనిపిస్తుంది ?
ఇది గాడ్ గిఫ్ట్. అదృష్టం. చాలా ఆనందంగా వుంది. నటన, దర్శకత్వం పై ప్రస్తుతానికి ఆసక్తి లేదు. నా ద్రుష్టి అంతా కొరియోగ్రఫీ పైనే వుంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?
మహేష్ గారు - త్రివిక్రమ్ గారి సినిమా, అలాగే రవితేజ గారి రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు జరుగుతున్నాయి.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Chiranjeevi, Shruti Haasan Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Releasing on December 19th,Telugu Golden TV,www.teluguworldnow.com

Advertisement
Author Image