For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సెప్టెంబర్ 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ గ్రౌండ్‌లో మెగా పబ్లిక్‌ ఈవెంట్‌

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
సెప్టెంబర్ 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ గ్రౌండ్‌లో మెగా పబ్లిక్‌ ఈవెంట్‌
Advertisement

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు  మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ.  స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.మేకర్స్ ఇప్పుడు గాడ్ ఫాదర్ మెగా పబ్లిక్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.

సెప్టెంబరు 28న అనంతపురంలోని జేఎన్‌టీయూ మైదానంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్‌ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

Advertisement GKSC

Two Megastars Chiranjeevi –Salman Khan’s Mega Mass Destruction In Promo Of Thaar Maar Song From GodFather, Full Song On September 15th,Telugu Golden TV,www.teluguworldnow.com,my mix entertainments,Telugu World Newsఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ముఖ్య తారాగణం.  కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్  అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Megastar Chiranjeevi, Salman Khan, Mohan Raja, Konidela Productions, Super Good Films, UCertificate for Godfather, Grand release worldwide on 5th October,Telugu Golden TV,www.teluguworldnow.com,My Mix Entertainments,telugu world news

Advertisement
Author Image