For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

BHAKTHI NEWS: అఖండ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు షాకింగ్ కామెంట్స్

11:01 PM Dec 16, 2021 IST | Sowmya
Updated At - 11:01 PM Dec 16, 2021 IST
bhakthi news  అఖండ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు షాకింగ్ కామెంట్స్
Advertisement

అఖండ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫస్ట్ టైమ్ ఆయన ఇలా సినిమాపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. పోయిన వారం నేను, నా స్వామివారి సేవక బృందంతో బోయపాటి దర్శకత్వంలో నిర్మితమైన అఖండ సినిమా చూశాను. పోయిన వారమే ఈ సినిమా గురించి చెప్పాలని అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయా. కానీ ఇవాల్టి రోజు ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మన అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. అహింసా ప్రథమో ధర్మః అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్దాంతాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది.

ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు ఇంతమంది ఈ సినిమాని చూస్తున్నారూ.. అంటే.. వారి మనసుల్లో ఈ ఉక్రోషం ఉంది. ఆక్రోషం ఉంది.. తపన ఉంది. ఏమీ చేయలేకపోతున్నామే.. అనే ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది. రాజ్యాంగం ఉంది.. అయినా మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసమే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది పాలకులు గుర్తించాలి.. అని అన్నారు.

Advertisement GKSC

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌పై పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతోనే రన్ అవుతోంది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.

Chilkur Balaji Temple Priest Rangarajan Comments on Akhanda Movie, Nandamuri Balakrishna, Boyapati Srinu, Akhanda Movie Review, Telugu World Now.

Advertisement
Author Image