For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'చెప్పాలని ఉంది' యూత్ అంతా చూడాల్సిన సినిమా : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
 చెప్పాలని ఉంది  యూత్ అంతా చూడాల్సిన సినిమా   మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. 'ఒక మాతృభాష కథ' అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. అస్లాం కీ సంగీతం అందించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదకానున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో నిఖిల్ ఈ వేడుకకు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలో యష్ పూరి, స్టెఫీ పటేల్ ఆల్బమ్ లోని పాటలకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... యువత ఎంతో సంతోషంగా చూడాల్సిన సినిమా 'చెప్పాలని ఉంది'. హీరోగా పరిచయం అవుతున్న యష్ పూరికి అభినందనలు. యష్ పూరి తల్లితండ్రులు సంతోషపడే రోజిది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువతకు గొప్ప అవకాశం వుంది. వారికీ అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. యువతని ప్రోత్సహించడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు వుంటాయి. యష్ పూరి మంచి ప్రతిభ గల నటుడు. ఒక సవాల్ గా తీసుకొని ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు.

Advertisement GKSC

ఈ సినిమా విడుదల తర్వాత తనకి బ్రహ్మాండమైన మార్కెట్, అన్ని చోట్ల మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం వుంది. యష్ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దర్శకుడు అరుణ్ కూడా ఒక సవాల్ గా తీసుకొని సినిమాని చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఆర్.బి చౌదరి, హీరోయిన్ స్టెఫీ పటేల్.. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ నా అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం వుంది. నేపధ్యంతో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలో వుంటుంది. యష్ పూరి భవిష్యత్ లో మున్ముందుకు వెళ్ళాలి'' అని పేర్కొన్నారు.

Advertisement
Author Image