For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సెన్సార్ బోర్డు స‌భ్యుల ప్ర‌శంస‌లందుకున్న "ఇదే మా క‌థ"

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
సెన్సార్ బోర్డు స‌భ్యుల ప్ర‌శంస‌లందుకున్న  ఇదే మా క‌థ
Advertisement

Censor Board Members Appriciated Ide Maa Katha Movie Team,Hero Srikanth,Sumanth Ashwin,Bhumika,Tanya Hope,Latest Telugu Movies,

సెన్సార్ బోర్డు స‌భ్యుల ప్ర‌శంస‌లందుకున్న "ఇదే మా క‌థ"

యువ హీరో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో గురు పవన్ దర్శకత్వం వహించిన రోడ్ జర్నీ చిత్రం 'ఇదే మా కథస‌.  'రైడర్స్ స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో  శ్రీమతి మనోరమ గురప్ప సమర్ప‌ణ‌లో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement GKSC

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్‌, `అడ్వంచ‌ర్ అవైట్స్` అనే క్యాప్ష‌న్‌తో కూడిన‌ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స‌రికొత్త క‌థ-క‌థ‌నంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. సినిమా చూసి సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌ని ప్ర‌శంసించి  'యూ' సర్టిఫికెట్ ఇచ్చారు.  అమేజింగ్ విజువ‌ల్స్‌, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రంలో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌లు, ఆ పాత్ర‌ల్లో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, భూమిక‌, తాన్యా హోప్ న‌ట‌న హైలైట్ అవుతుంద‌ని అలాగే సి.రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ, సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అవుతాయ‌ని
చిత్ర బృందం తెలిపింది.

తారాగ‌ణం:
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక‌, తాన్యా హోప్, సుబ్బ‌రాజు, సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్ర‌సాద్‌, తివిక్రమ్ సాయి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మ‌ధుమ‌ణి, సంధ్య జన‌క్.

సాంకేతిక బృందం:
స్టోరీ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గురు ప‌వ‌న్‌
ప్రొడ్యూస‌ర్: జి. మ‌హేష్‌
స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమతి మనోరమ గురప్ప
సినిమాటోగ్ర‌ఫీ: సి. రామ్ ప్ర‌సాద్‌
సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌
ఆర్ట్: జెకె మూర్తి
ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖి,
ఫైట్స్‌: పృథ్వీరాజ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: చిరంజీవి ఎల్.‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

Advertisement
Author Image