For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: "మాచర్ల నియోజకవర్గం"లో మరో హీరోయిన్ గా "కేథరిన్ థ్రెసా"

10:50 PM Nov 16, 2021 IST | Sowmya
Updated At - 10:50 PM Nov 16, 2021 IST
tollywood updates   మాచర్ల నియోజకవర్గం లో మరో హీరోయిన్ గా  కేథరిన్ థ్రెసా
Advertisement

విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్ ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.

మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిన్గా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్ థ్రెసా పాల్గొనబోతోన్నారు. కేథరిన్ థ్రెసా, నితిన్లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

Advertisement GKSC

నటీనటులు : నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు

సాంకేతిక బృందం:
రచయిత, దర్శకుడు : ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి
సమర్పణ : రాజ్ కుమార్ ఆకెళ్ళ
నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్ : శ్రేష్ట్ మూవీస్
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
లైన్ ప్రొడ్యూసర్ : జీ హరి
మాటలు : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్
పీఆర్ఓ : వంశీ-శేఖర్

Catherine Tresa Comes On Board For Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam,Krithi Shetty,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image