For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Brahmaji: "చిరంజీవి గారు సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లట్లేదు. .. కానీ నాకోసం వచ్చారు ..నిజానికి ఇండస్ట్రీలో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా ప్రతి సారి అడిగితే బాగోదు "అంటున్న బ్రహ్మాజీ

11:47 AM Jul 11, 2023 IST | Sowmya
Updated At - 11:47 AM Jul 11, 2023 IST
brahmaji   చిరంజీవి గారు సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లట్లేదు     కానీ నాకోసం వచ్చారు   నిజానికి ఇండస్ట్రీలో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా ప్రతి సారి అడిగితే బాగోదు  అంటున్న బ్రహ్మాజీ
Advertisement

Brahmaji : ‘ఓ పిట్ట‌క‌థ’తో(O Pittakatha) మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు న‌టుడు బ్ర‌హ్మాజీ తనయుడు సంజ‌య్ రావ్(Sanjay Rrao). దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత రెండో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’(Slum Dog Husband) తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఏఆర్ శ్రీధర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌వి మానుకొండ హీరోయిన్‌ గా మైక్ మూవీస్ బ్యాన‌ర్‌పై అప్పిరెడ్డి, వెంక‌ట్ అన్న‌ప‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఉండబోతుంది అని అర్ధమవుతుంది. కుక్కతో పెళ్లి అనే సరదా కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ జులై 21న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు చిత్రయూనిట్.

Advertisement GKSC

ఈ ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి బ్రహ్మజీని ఉద్దేశించి.. మీకు ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎవరైనా స్టార్ హీరోలను రప్పిస్తున్నారా అని అడిగారు.

దీనికి బ్రహ్మాజీ సమాధానమిస్తూ.. నాకు ఇండస్ట్రీలో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నా ప్రతి సారి అడిగితే బాగోదు. సంజయ్ మొదటి సినిమా ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు ఆయన సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లట్లేదు. అయినా నేను వెళ్లి అడిగాను. నీ కోసం వస్తే ఇంకో 20 మంది అడుగుతారు అని అన్నారు చిరంజీవి. నేను అయితే వద్దు అన్నయ్య, మీకు ఇబ్బంది ఎందుకు అంటే పర్లేదు నేను వస్తాను, నీ కోసం, మీ అబ్బాయి కోసం వస్తాను అని చెప్పి ఆయనే ఒక ప్లేస్ కూడా చెప్పి ఈవెంట్ అక్కడ చేయండి అని సజెస్ట్ చేశారు.

Advertisement
Author Image