For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Megastar Chiranjeevi : మెగాస్టార్ " వాల్తేరు వీరయ్య " మూవీ నుంచి బాస్ పార్టీ సాంగ్ రిలీజ్..!

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
megastar chiranjeevi   మెగాస్టార్   వాల్తేరు వీరయ్య   మూవీ నుంచి బాస్ పార్టీ సాంగ్ రిలీజ్
Advertisement

Megastar Chiranjeevi :  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా... ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి బాస్ పార్టీ లిరికల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేశారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ క్రమంలోనే నేడు విడుదలైన బాస్ పార్టీ సాంగ్ దుమ్మురేపుతోంది. మరోసారి దేవి తన స్టైల్ లో మాస్ మసాలా సాంగ్ ను కంపోజ్ చేశారు. ఇక ఈ పాటలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది. ఇక బాస్ సాంగ్ లో మెగాస్టార్ స్టెప్స్ అదుర్స్ అనే చెప్పాలి.

Advertisement GKSC

శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ సాంగ్ థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. కలర్‌ఫుల్ చొక్కా, లుంగీ, చెవి పోగు, మెడలో గొలుసు, గడియారం, షూస్‌.. మాస్ అప్పీల్‌లో ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నారు చిరంజీవి. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట దుమ్మురేపుతూ ట్రెండింగ్ గా మారింది.

Advertisement
Author Image