For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sridevi’s Dream :ఇన్నాళ్లకు శ్రీదేవి చిర‌కాల కోరిక‌ను తీర్చిన భ‌ర్త బోనీకపూర్ ... అదేంటో ఇప్పుడే తెలుసుకోండి .

11:05 PM Aug 20, 2023 IST | Sowmya
Updated At - 11:05 PM Aug 20, 2023 IST
sridevi’s dream  ఇన్నాళ్లకు శ్రీదేవి  చిర‌కాల కోరిక‌ను తీర్చిన  భ‌ర్త బోనీకపూర్     అదేంటో ఇప్పుడే తెలుసుకోండి
Advertisement

Sridevi’s Dream : అతిలోక సుంద‌రి శ్రీదేవి (Sri Devi) గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. 24 ఫిబ్ర‌వ‌రి 2018న‌ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన‌ప్ప‌టికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలంద‌రితో న‌టించిన శ్రీదేవి దుబాయ్‌లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు మ‌ర‌ణించింది. ఆమె చ‌నిపోయి ఐదేళ్లు కావొస్తోంది. ఇన్నాళ్లకు ఆమె చిర‌కాల కోరిక‌ను భ‌ర్త బోనీకపూర్ తీర్చారు.

80వ ద‌శ‌కంలో హీరోయిన్‌గా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో శ్రీదేవి చెన్నైకి స‌మీపంలోని మహాబలిపురం ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌లో బీచ్‌ దగ్గర 5 ఎక‌రాలు కొనుగోలు చేసింది. ఇక్క‌డ తన డ్రీమ్ హౌస్ క‌ట్టుకోవాల‌ని ఎంతో ఆశ‌ప‌డింది. అయితే.. ఆ కోరిక తీర‌కుండానే ఆమె అంద‌రినీ విడిచివెళ్లిపోయింది. త‌న భార్య చిర‌కాల కోరిక‌ను భ‌ర్త, బాలీవుడ్ నిర్మాత‌ బోనీక‌పూర్ ఇన్నాళ్లకు నెర‌వేర్చారు.

Advertisement GKSC

తాజ్‌ గ్రూప్‌ పార్ట్‌నర్‌షిప్‌లో హోటల్‌గా అభివృద్ధి చేశారు. “ఇది శ్రీదేవి కల. ఆమె డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్‌ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్‌ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది.” అని బోనీకపూర్ చెప్పారు. శ్రీదేవి డ్రీమ్‌ హౌస్‌ లొకేషన్‌ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌ల్లి బాట‌లోనే ప‌య‌నిస్తోంది. శ్రీదేవి కూతురిగా ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న ‘దేవ‌ర’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీకపూర్‌ లుక్ వైర‌లైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement
Author Image