Chandramuki 2 : లారెన్స్ చంద్రముఖి 2 లో కీ రోల్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..!
Chandramuki 2 : సూపర్ స్టార్ రజినీ కాంత్, జ్యోతిక నటించిన " చంద్రముఖి " సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మామలుది కాదు... పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో జ్యోతిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా రాబోతున్న ఈ సినిమాకు చంద్రముఖి డైరెక్టర్ పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతకు ముందు మైసూర్ లో జరిగిన చిత్రీకరణలో లారెన్స్, రాధికలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఓ కీలక పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తుంది. కేవలం సినిమాల తోనే కాకుండా వివాదస్పద వ్యాఖ్యలతోనూ కంగనా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది.
ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం కంగనాను మూవీ టీమ్ సంప్రదించారని అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఈ సినిమాలో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.