For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అక్కాతమ్ముడు కలిసి ఇలా స్కాం చేయడమనేది నన్ను బాగా ఆకట్టుకుంది: సునీల్ శెట్టి

02:14 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:14 PM May 11, 2024 IST
అక్కాతమ్ముడు కలిసి ఇలా స్కాం చేయడమనేది నన్ను బాగా ఆకట్టుకుంది  సునీల్ శెట్టి
#Mosagallu
Advertisement

బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఇంటర్వ్యూ.బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సునీల్ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మోసగాళ్లు సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?
సునీల్ శెట్టి : ఓ సినిమా చేయాలంటే స్క్రిప్ట్ బాగా ఉండాలి. చేసే దర్శకుడు, అదిరిపోయే కథ, హాలీవుడ్ స్థాయిలో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కలిసి ఈ సినిమాను ఓకే చేసేలా చేశాయి. సినిమాను చూసే విధానం, దాన్ని తెరపైనే తెరకెక్కించేదానికి ఎంతో తేడా ఉంటుంది. అక్కాతమ్ముడు కలిసి ఇలా స్కాం చేయడమనేది నన్ను ఆకట్టుకుంది. వారిని పట్టుకోవడమే నా పాత్ర. కానీ వారిద్దరూ ఎంతో తెలివిగా సిస్టం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. యదార్థ ఘటనల ఆధారంగా తీసే సినిమాలు వర్కవుట్ అవుతుంటాయి. జనాలు వాటినే ఇష్టపడుతున్నారు. ఇందులో ఎంతో వినోదం కూడా ఉంది. అవన్నీ కూడా నన్ను ఈ సినిమాను ఒప్పుకునేలా చేశాయ్.

Advertisement GKSC

తెలుగు భాషతో మీకు ఏదైనా సమస్యలు వచ్చాయా?
సునీల్ శెట్టి : నాకు తెలిసి తెలుగు భాషను మాట్లాడటమే కష్టం కానీ అర్థం చేసుకోవడం సులభమే. ప్రతీ పదం అర్థం తెలుసుకోవడం కష్టం. కానీ నాకు అద్భుతమై టీం దొరికడంతో అది సులభమైంది. మామూలుగా అయితే ఈ మూవీ మొదటగా ఇంగ్లీష్‌లోనే షూట్ చేశాం. ఆ తరువాతే తెలుగులో తీశాం. హిందీ వర్షెన్‌ను కూడా చేశాం. అలా వేర్వేరు భాషల్లో చేయడం చాలా కష్టతరమైన పని. కానీ నా వంత ప్రయత్నం నేను చేశాను.

వయసు కనపడకుండా ఇలా ఎలా ఉంటున్నారు? మీ సీక్రెట్స్ ఏంటి?
సునీల్ శెట్టి : నేను ఏం తింటున్నాను.. ఎంత తినాలే అనే దానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. నా వయసు మీద ఓ దృష్టి పెట్టాలి.. అలానే నా ఫిట్‌నెస్ మీదా శ్రద్ద పెట్టాలి. అందుకే నేను తినే తిండి మీద చాలా శ్రద్దగా ఉంటాను. ఇక యోగా, వర్కవుట్లు ప్రతీరోజూ కచ్చితంగా చేస్తాను.మోసగాళ్లు సినిమా చేస్తున్న సమయంలో ఏమైనా మెమోరీస్ ఉన్నాయా?
సునీల్ శెట్టి : మోసగాళ్లు టీంతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీది అనుకున్న సమయంలో అయిపోతుంది. అదే దక్షిణాది పరిశ్రమ గొప్పదనం. తినడం, ప్యాకప్ చెప్పడం, రిహార్సల్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా అన్నీ టైంకి జరుగుతూ ఉంటాయి. హైద్రాబాద్‌లో అడుగుపెట్టినప్పుడే నాకు ఓ రకమైన మంచి అనుభూతి కలిగింది. నేను డైరెక్టర్ జెఫ్రీ, విష్ణు, కాజల్‌తో ఎప్పుడూ కూడా పని చేయలేదు. ఈ సినిమాను వాళ్లు కొత్తగా ఆలోచించారు.. సరికొత్తగా తెరకెక్కించారు. వారు మా అనుభవాన్ని ఉపయోగించుకున్నారు.. మేం వారి క్రియేటివిటీని వాడుకున్నాం. వారు సీన్ బై సీన్ వెళ్తుంటారు.

విష్ణుతో మీ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏమైనా పంచుకున్నారా?
సునీల్ శెట్టి : విష్ణు కొత్త తరానికి చెందిన వారు. వారికే ఇంకా బాగా తెలుస్తాయ్. నేను పాత కాలపు మనిషిని. సినిమాలో మా ఇద్దరి మధ్య ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయ్. ప్రతీ యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుంది. పైగా యాక్షన్ సీక్వెన్స్‌లంటే ఎంతో శ్రద్దగా ఉండాలి. టైమింగ్‌తో చేయాలి లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ మా సెట్‌లో అలాంటివేమీ జరగలేదు అదే మా అదృష్టం.

గని సినిమా గురించి చెప్పండి?
సునీల్ శెట్టి : గని అద్భుతంగా ఉండబోతోంది.. వరుణ్ తేజ్ నిజంగా బ్రిల్లియంట్. మళ్లీ ఓ కొత్త దర్శకుడు. ఈ సినిమా కోసం మళ్లీ శరీరాకృతిని మార్చాలి.. నేను ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తున్నాను.

Advertisement
Author Image