For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా `బూట్ క‌ట్ బాల‌రాజు`

09:42 PM Dec 08, 2021 IST | Sowmya
Updated At - 09:42 PM Dec 08, 2021 IST
film news  బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా  బూట్ క‌ట్ బాల‌రాజు
Advertisement

బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `బూట్ క‌ట్ బాల‌రాజు`. శ్రీ కోనేటి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. మొద‌టి స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ కొట్టగా మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా..

సోహెల్ మాట్లాడుతూ - ``బిగ్‌బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చేస్తున్న రెండో చిత్ర‌మిది. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. బూట్ క‌ట్ బాల‌రాజు అనే క్యారెక్ట‌ర్ డెఫినెట్‌గా మీ అంద‌రిలో ఉండిపోతుంది. అన్ని వ‌ర్గాల వారు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. కోనేటి శ్రీ‌ను చాలా ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం`` అన్నారు.

Advertisement GKSC

అన‌న్య నాగ‌ళ్ల మాట్లాడుతూ - ``మ‌ల్లేశం సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్ట‌ర్స్ రావ‌డం మొద‌లైంది. ఈ సినిమాలో కొంచెం బ‌బ్లీగా ఉండే క్యారెక్ట‌ర్. నాకు చాలా ఇష్ట‌మైన పాత్ర‌. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌. ల‌క్కీ మీడియాలో సోహెల్‌తో క‌లిసి చేయ‌డం చాలా హ్యాపీ`` అన్నారు.

Bigg Boss4 Syed Sohel Ryan New Film Bootcut Balraju As a Hero,Heroine Ananya Nagalla,Sri Koneti,Indraja,telugu golden tv,my mix entertainemts,teluguworldnow.comన‌టీన‌టులు: సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, శ్రీ‌మ‌తి ఇంద్ర‌జ‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, ఆనంద్ చ‌క్ర‌పాణి, ఝాన్సి, జ‌బ‌ర్‌ద‌స్త్ రోహిణి, మాస్ట‌ర్ రామ్ తేజ‌స్‌

టెక్నీషియ‌న్స్‌ :
క‌థ‌- ద‌ర్శ‌కత్వం - శ్రీ కోణేటి
నిర్మాత‌- బెక్కం వేణుగోపాల్
కో-ప్రొడ్యూస‌ర్ - బెక్కం బ‌బిత‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - నాగార్జున్ వ‌డ్డె
డిఓపి- గోకుల్ భార‌తి
సంగీతం - భీమ్స్‌
ఎడిట‌ర్ - ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌- విత‌ల్ కోసానం
పిఆర్ఓ - వంశీ - శేఖ‌ర్‌

Advertisement
Author Image