For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhoothaddham Bhaskar Narayana : 'భూతద్ధం భాస్కర్ నారాయణ' సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది : హీరో శివ కందుకూరి

01:03 PM Feb 28, 2024 IST | Sowmya
Updated At - 01:03 PM Feb 28, 2024 IST
bhoothaddham bhaskar narayana    భూతద్ధం భాస్కర్ నారాయణ  సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది   హీరో శివ కందుకూరి
Advertisement

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యం ప్రీరిలీజ్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో శివ క్యారెక్టర్ ని బిగినింగ్ లో ఓ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది. చెక్కతో చేసి దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ .. ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి. 'భూతద్ధం భాస్కర్ నారాయణ'గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా వుంది. తన పాత్ర కథలో లీనం చేసేలా వుంది. రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్ గా కనిపించింది. షఫీ, దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిరిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.

Advertisement GKSC

ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రీరిరిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా వుంది.  సినిమా ప్రమోషన్స్ ని చాలా యూనిక్ చేశాం. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చాలా నమ్మకంగా వున్నాం. మా సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. మాకు పరిశ్రమ నుంచి కూడా మంచి ఆదరణ దొరికింది. చాలా మంది సపోర్ట్ చేశారు. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ మాకు మరింత నమ్మకాన్ని పెంచింది. దర్శకుడు నిర్మాతలకు టీం అందరికీ థాంక్స్. మార్చి 1న సినిమా వస్తోంది. సక్సెస్ మీట్ లో కలుద్దాం' అన్నారు.

Advertisement
Author Image