For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, ఇతర నటీనటులపై 'భోళా శంకర్' పాట

06:38 AM Jun 09, 2023 IST | Sowmya
Updated At - 06:38 AM Jun 09, 2023 IST
మెగాస్టార్ చిరంజీవి  తమన్నా  కీర్తి సురేష్  ఇతర నటీనటులపై  భోళా శంకర్  పాట
Advertisement

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్' మ్యూజికల్ ప్రమోషన్లు ఇటీవలే మొదటి పాట భోళా మానియాతో ప్రారంభమయ్యాయి. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మహతి స్వర సాగర్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఫుట్ టాపింగ్ మాస్ నంబర్‌ను స్కోర్ చేసారు. చిరంజీవి డ్యాన్స్‌లు చూడటానికి కన్నుల పండగలా వున్నాయి.

రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్ నెంబర్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మహతి అందించిన డ్యాన్స్ నంబర్‌ను ఎక్స్ టార్డినరిగా చిత్రీకరిస్తున్నారు.

Advertisement GKSC

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.

డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. భోళా శంకర్  ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement
Author Image