For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhakthi : భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏమని బోధించాడంటే..

12:43 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:43 PM May 13, 2024 IST
bhakthi   భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏమని బోధించాడంటే
Advertisement

Bhakthi : భగవద్గీత హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథం వ్యాసం హర్షి రచించిన మహాభారతంలో ఒక భాగం భగవద్గీత యుద్ధంలో గెలవడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన గొప్ప సందేశం అయితే భగవద్గీత అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనుషులకి ఒక మంచి దారిని చూపిస్తుంది అందులో ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఎలా బతకాలో తెలుపుతుంది అయితే భగవద్గీతలో ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే..

భగవద్గీతలో మనిషి ఎలా జీవించాలో పూర్తిగా వివరించారు కృష్ణ పరమాత్మ అందులో భాగంగా..

Advertisement GKSC

https://youtu.be/Z9ULo8NcClA

ఒకసారి అర్జునుడు శ్రీ కృష్ణుడిని అడిగాడు – ” ఈ గోడ పై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా.. అది ఎలా ఉండాలంటే.. సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దు:ఖం రావాలి.. దు:ఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి. అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా రాశాడు.. ‘ఈ సమయం వెళ్లిపోతుంది’ – భగవద్గీత. అలాగే ఎవరు భక్తితో నాకు పవిత్రమైన పుష్పమైనా, ఫలమైనా, ఉదకమైనా ఫలాపేక్షరహితంగా సమర్పించుచున్నారో అట్టివారిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను – భగవద్గీత.

ఓడిపోయానని బాధపడకు. ఇంకోసారి ప్రయత్నించు.. ఈసారి నీకు నేను తోడుగా ఉంటాను.. – భగవద్గీత. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కనుక.. ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది – భగవద్గీత.

ఏ విషయం మీదా ఆసక్తి లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో.. అలాంటివారిగానే తయారవుతారు. ఎలాంటి ఆలోచనలు ఉంటే.. అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు – భగవద్గీత.

Advertisement
Author Image