For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bharateeyans Movie Review :నేడు రిలీజ్ అవుతున్న మరో దేశభక్తి చిత్రం "భారతీయన్స్".. రివ్యూ, రేటింగ్..!

11:23 AM Jul 14, 2023 IST | Sowmya
Updated At - 11:23 AM Jul 14, 2023 IST
bharateeyans movie review  నేడు రిలీజ్ అవుతున్న మరో దేశభక్తి చిత్రం  భారతీయన్స్    రివ్యూ  రేటింగ్
Advertisement

Bharateeyans Movie Review : ఫిల్మ్ ఇండస్ట్రిలో ఇప్పటి వరకు ఎన్నో దేశ భక్తి చిత్రాలు వచ్చాయి. ఎందరో మహనీయుల ప్రాణ త్యాగ  ఫలితంగా మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం , ఈ స్వేచ్ఛ .. వీటన్నింటినీ ఎవరూ అంత  త్వరగా మర్చిపోలేరు. మర్చిపోకూడదు కూడా.. వారి త్యాగాల్ని మన కళ్ళకు కట్టేలా పలువురు సినిమాలను రూపొందించి ఘన విజయాల్ని అందించారు. భాషతో అనుబంధం లేకుండా ఘన విజయాల్ని అందుకున్నారు. ఇక టాలీవుడ్ లో దేశ భక్తి చిత్రాలకు కొదువే లేదు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ తరుణంలోనే ఇప్పుడు కొత్త నటీనటులతో మరో దేశ భక్తి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేటి తరం యువతకు మరోసారి దేశభక్తి గురించి మంచి సందేశాత్మకంగా అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని.. సమకాలీన అంశాలతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

 కథ:

Advertisement GKSC

ఈ కథలో పాత్రల పేర్లుండవు. ప్రాంతాల పేర్లతో పాత్రలను పిలుస్తుంటారు. అలా భోజ్ పురి, తెలుగు, నేపాలి, బెంగాలి, త్రిపుర, పంజాబీలు ఇలా ఆరుగురు ఒకే చోటకు చేరుతారు. వాళ్లందరికీ ట్రైనింగ్ ఇస్తారు. చివరకు వారిని ఇండియన్ బార్డర్ దాటి చైనాలోకి వెళ్లమని చెబుతారు. అక్కడి గెస్ట్ హౌస్‌లోని ల్యాబ్‌లో ఏం జరుగుతోంది? అక్కడి సీక్రెట్లు ఏంటి? అనేది తెలుసుకుని రావాలని చెబుతారు. అసలు ఆ ఆరుగురు ఒకే చోటకు ఎందుకు వచ్చారు? వారి నేపథ్యం ఏంటి? వారికి ట్రైనింగ్ ఇచ్చిన వారు ఎవరు? చైనా వాడు వేసిన ఎత్తు ఏంటి? చివరకు ఈ ఆరుగురు ఏం చేశారు? అన్నది కథ.

నీరోజ్‌ పుచ్చా, సోనమ్‌ టెండప్‌, సుభారంజన్‌, మహేందర్‌ బర్గాస్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం “భారతీయన్స్‌”. అలానే సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్‌ నాంగ్యాల్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా చేయగా.. దీన్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.శంకర్‌ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. నేడు (జూలై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి సంబంధించిన స్టోరీ ,  రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..!

విశ్లేషణ:
దేశ భక్తి సినిమాలు, సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద కుట్రలు, చైనా, పాకిస్థాన్, ఇండియా అనే అంశాల మీద సినిమా తీయడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని నిర్మాత శంకర్, దర్శకుడు ధీన రాజ్ చేశారు. అయితే ఈ దేశ భక్తి సినిమాను ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. నటీనటుల ప్రభావం ఆడియెన్స్ మీద మరి కొంత పడి ఉంటే బాగుండేది.

ప్రథమార్థం అంతా కూడా పాత్రల పరిచయం, వారి వారి నేపథ్యాలు చూపించడంతో గడిచింది. ద్వితీయార్థంలోనే అసలు కథ, ట్విస్టులుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి పది నిమిషాలు దేశ భక్తి రగిల్చేలా ఉంటుంది. క్లైమాక్స్ బాగానే కష్టపడ్డట్టుగా కనిపించింది. సినిమా ముగింపు కూడా అందరినీ కదిలిస్తుంది. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని చాటి చెప్పే చిత్రమిది

నటీనటులు ఎలా చేశారంటే ...

భారతీయన్స్ సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి. దేశభక్తిని చాటే సన్నివేశాలుంటాయి. వాటిలో నటీనటులు చక్కగా నటించారు. భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర, తెలుగు, బెంగాలి ఇలా అందరూ చక్కగా నటించారు. పంజాబీ, త్రిపుర, బెంగాలి పాత్రల్లో చేసి అమ్మాయిలు తెరపై అందంగా కనిపించారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లోనూ మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా చూపించారు కెమెరామెన్. సంగీతం బాగుంది. ఆర్ఆర్‌తో కొన్ని సీన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

మూవీ రేటింగ్:- 3/5

Advertisement
Author Image