For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: "భగత్ సింగ్ నగర్" చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన నటుడు "ప్రకాష్ రాజ్"

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
tollywood news   భగత్ సింగ్ నగర్  చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన నటుడు  ప్రకాష్ రాజ్
Advertisement

Tollywood News: తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు "భగత్ సింగ్ నగర్" చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన... నటుడు ప్రకాష్ రాజ్.

ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా  విడుదలైన "భగత్ సింగ్ నగర్" టీజర్, గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై  విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్". తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో, దర్శకుడు వీరభద్రం , దర్శకుడు చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్ , దర్శకుడు బాబ్జి , నువ్వు తోపురా నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్ , యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్,  చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC

ముఖ్య అతిధిగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులు తో పని చేశాను.వీరంతా నాలోని నటనను చెక్కి దిద్ది నాలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడున్నాను. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏ.వి లో బావుంది. కానీ నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించడం తప్పు. సినిమాను సినిమాగానే చూద్దాం. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. అవసరమైతే మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ ను తీసివేయమని కోరుతున్నానను. నాకు భగతసింగ్ అంటే  నాకు ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని . ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.భగతసింగ్ ఉంటే చెగువేరా అంతటి మనిసయ్యేవారు. చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను కాలీగా ఉన్నానే ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను వారికి నా అవసరం ఉంటుంది అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన.దేశంతో పని లేకుండా సాటి మనిషి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి  మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.ఎంతోమంది గురువులు వున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో  వస్తున్న ఇలాంటి  యువకుల ఆలోచనలను,ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి కనుక మనమంతా సపోర్ట్ గా నిలిచి ఎంకరేజ్ చెయ్యాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు.