For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నేను స్టూడెంట్ సర్! సినిమాతో గణేష్ కి మరో విజయం : దర్శకుడు వివి వినాయక్

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
నేను స్టూడెంట్ సర్  సినిమాతో గణేష్ కి మరో విజయం   దర్శకుడు వివి వినాయక్
Advertisement

తొలి సినిమా 'స్వాతిముత్యం'తో ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్ సర్'తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పుడు విడుదలైన టీజర్ చూస్తుంటే గణేష్ రెండవ చిత్రం, తన తొలి చిత్రానికి పూర్తి భిన్నంగా వుంది. గ్రాండ్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ టీజర్‌ ను విడుదల చేశారు.

ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ అనౌన్స్ మెంట్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రతి యువకుడిలాగే గణేష్ కూడా ఎంతో ఆశపడి ఐ ఫోన్ కొంటాడు. కానీ ఫోన్ దొంగిలించబడుతుంది. ఆ తర్వాత ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. అయితే అక్కడ పోలీసు అధికారులే దొంగలించారని గణేష్ చెప్పడం సర్ ప్రైజింగా వుంది.

Advertisement GKSC

కృష్ణ చైతన్య ఒక విలక్షణమైన కథ అందించారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి టేకింగ్‌ బ్రిలియంట్ గా వుంది. టీజర్ కంటెంట్,  ప్రెజెంటేషన్‌ తో  అలరించింది. గణేష్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్-ప్యాక్డ్ టీజర్‌ లో హీరోయిన్ అవంతిక దాసాని తో పాటు   కీలక పాత్రలు పోషించిన సముద్రఖని, సునీల్ ,  శ్రీకాంత్ అయ్యంగార్ ‌లతో సహా ప్రముఖ నటీనటులందరూ కనిపించారు.

ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘నాంధి’ సతీష్ వర్మ తన సినిమాలకు కథలను ఎంపిక చేసుకోవడంలో మంచి అభిరుచిని కలిగి ఉన్నాడని టీజర్ ద్వారా తెలుస్తుంది. నాంది లానే  నేను స్టూడెంట్ సర్! కంటెంట్ రిచ్ మూవీగా ఉండబోతోంది.

మహతి స్వర సాగర్ అమేజింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిత్ మదాడి అద్భుతమైన సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి  కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందించారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలను పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. సతీష్ గారు తీసిన 'నాంది' సినిమా చూశాను. ఎక్కడా రాజీ పడకుండా మంచి కంటెంట్ తో తీశారు. ఇప్పుడు సతీష్ గారి సంస్థలో గణేష్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది.  నేను స్టూడెంట్ సర్! టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో గణేష్ కి మరో విజయం రావాలని కోరుకుంటున్నాను. అవంతిక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతుంది. వాళ్ళ అమ్మగారు భాగ్యశ్రీలానే అవంతిక కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రాఖీ తో పాటు ఈ చిత్రానికి పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ బెస్ట్ విశేష్'' తెలిపారు.

Advertisement
Author Image