ధనుష్ ‘కర్ణన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌చేయనున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో "బెల్లంకొండ సాయి శ్రీనివాస్"
Bellamkonda Sai Srinivas In Official Remake Of Dhanush's Blockbuster Karnan,VV Vinayak,Latest Telugu Movies,
ధనుష్ ‘కర్ణన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌చేయనున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
తమిళంలో విజయం సాధించిన ‘రాట్ససన్’ చిత్రానికి తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’లో హీరోగా నటించి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా తమిళ హిట్ ‘కర్ణన్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ చిత్రాన్ని మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేశారు. తమిళనాడులో ఇటీవల ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటుగా, భారీ వసూళ్లు సాధించింది.
ధనుష్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కిన‘కర్ణన్’మూవీని ఇటీవల బెల్లకొండ సాయిశ్రీనివాస్ వీక్షించి ఈ సినిమా కథ, ఎగ్జిక్యూషన్ తనకి బాగా నచ్చడంతో ‘కర్ణన్’ తెలుగు రీమేక్‌లో నటించాలని డిసైడ్ అయ్యారు. ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ దర్శకుడు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ప్రభాస్ కెరీర్ రేంజ్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్లిన ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇప్పటికే మొదలు
కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్
ఆల్రెడీ హైదరాబాద్‌లో భారీ సెట్ వేశారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత ధనుష్ కర్ణన్
తెలుగు రీమేక్ వర్క్స్ ను మొదలు పెట్టనున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.
‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్, ‘కర్ణన్’ తెలుగు రీమేక్..ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు రీమేక్ చిత్రాల్లో యాక్ట్ చేసేందుకు బెల్లకొండ సాయిశ్రీనివాస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం.
Young and promising hero Bellamkonda Sai Srinivas delivered a big blockbuster with Rakshasudu which was remake of Tamil movie Ratsasan. His next two films will also be remakes.