For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని కథానాయికగా 'నేను స్టూడెంట్ సార్!'

10:32 AM Feb 18, 2023 IST | Sowmya
Updated At - 10:32 AM Feb 18, 2023 IST
బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని కథానాయికగా  నేను స్టూడెంట్ సార్
Advertisement

తొలి చిత్రం 'స్వాతిముత్యం' ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్  తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!'తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. నేను స్టూడెంట్ సార్! మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. ప్రధాన తారాగణం సీరియస్ లుక్ లో ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్  చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

Advertisement GKSC

బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ కెమరామెన్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో  వంశీ-శేఖర్

Advertisement
Author Image