For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: "బంగార్రాజు" సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది: అక్కినేని నాగ చైతన్య

06:23 PM Jan 12, 2022 IST | Sowmya
Updated At - 06:23 PM Jan 12, 2022 IST
tollywood updates   బంగార్రాజు  సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది  అక్కినేని నాగ చైతన్య
Advertisement

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.

నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేది. మనం సినిమాలో ఆ భయం ఉండేది. ఆ ఎక్స్‌పీరియెన్స్ వల్ల బంగార్రాజులో అంతగా భయం అనిపించలేదు. పూర్తిగా ఓపెన్ అయిన నటించాను. షూటింగ్ కంటే ముందే నాన్నను, కళ్యాణ్‌ను చాలా డౌట్స్ అడిగాను. నేను మొదటి సారి సీక్వెల్‌ చేశాను. నాకు అదే భయంగా ఉంది. బంగార్రాజు పాత్రను ఓన్ చేసుకునేందుకు సోగ్గాడే సినిమాను చాలా సార్లు చూశాను. చాలా హోం వర్క్ కూడా చేశాను.

Advertisement GKSC

సినిమాలో రెండు పాత్రలు సమానంగానే ఉంటాయి. నాన్నది గెస్ట్ రోల్ కాదు. బంగార్రాజు పాత్రే ముఖ్యం. ఈ సినిమా మొత్తం నాన్నగారు, రమ్యకృష్ణ గారి మీది నుంచే నడుస్తుంది. ఇక రాము పాత్ర అమెరికాలో ఉంటుంది. సినిమాలో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్. ఫెస్టివెల్ మూడ్, సీన్ కోసం అలా సరదాగా హీరోయిన్లను పెట్టారు. ప్రతీ పాటలో మంచి కొరియోగ్రఫీ ఉంటుంది. నాలుగు పాటలను ఎంజాయ్ చేస్తూ చేశాను. పండుగకు ఇలాంటి సినిమాలే రావాలి.

బంగార్రాజు రొమాంటిక్ సినిమా అని కాదు. రొమాన్స్‌లో  ఎంటర్టైన్మెంట్ యాడ్ అయి ఉంటుంది. నాకు నాగలక్ష్మీకి మంచి సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు తగ్గదు. ఇది ఫెస్టివెల్ సినిమా. ఇది పండుగ కోసం రెడీ చేసిన సినిమా. నాన్న గారు మొదటి నుంచి అదే నమ్మకంతోనే ఉన్నారు. నాలుగేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది. కానీ ఇద్దరి డేట్స్ అడ్జస్ట్ అయ్యేసరికి ఇంత టైం అయింది. బంగార్రాజును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేశాం. 90 రోజుల్లో సినిమాను చేశాం.Bangaraju Movie is like full meals in Sankranthi festival , Akkineni Naga Chaitanya interview,Akkineni Nagarjuna,Krithy Shetty,Kalyan Krishna,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comబంగార్రాజు పాత్ర కోసం తాతగారి వస్తువులను నాన్న ఏవైతే వాడారో నేను కూడా అన్నీ వాడాను. కృతి శెట్టి చాలా మంచి నటి. చాలా హోం వర్క్ చేస్తుంది. ఆమె డెడికేషన్ వేరే లెవెల్. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి అద్భుతంగా నటించింది. ఈ పాత్రకు న్యాయం చేసింది. రమ్యకృష్ణతో గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. శైలజారెడ్డి అల్లుడు సినిమాతో ఫుల్ లెంగ్త్ నటించాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. సీనియర్స్ ఆర్టిస్ట్‌లతో నటిస్తుంటే ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే నేను వారితో నటించే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటాను. రమ్యకృష్ణ గారు ఎంతో సరదాగా ఉంటారు.

Advertisement
Author Image