బందూక్ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మురారికి అరుదైన గౌరవం
లక్ష్మణ్ మురారి విభిన్న ఆలోచనకు రూపమిచ్చి సెళ్యులైడ్ పై సరికొత్త కథలను ఆవిష్కరించే దర్శకులు.. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న తన మొదటి చిత్రం బందూక్ చిత్రమే తన ప్రతిభ కు నిదర్శనం గత 20 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ లో వున్న అనుభవంతో, స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడి గానే కాకుండా , సినిమా రిలీస్ లో సరికొత్త ప్రణాళికలతో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి.. ఏకవీర, వేటాడు వెంటాడు, 143-Hydarabad, సతీలీలవతి లాంటి డబ్బింగ్ సినిమాలు తన ప్రత్యేకతకు నిదర్శనం, అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ లో తాను అవలంబించే పద్ధతే తనకు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇవి కాకుండా 3D VFX లో అప్రతిహాతంగా చేస్తున్న సాధనే తన 3D అనిమేషన్ AD FILMS కు దోహదబడింది. 20 సంవత్సరాలలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న దర్శకులు లక్ష్మణ్ గారు గత సంవత్సరం తన దర్శకత్వంలో రూపొందించిన THRILL CITY 3D Animation Ad film కు గానూ.. TIME Cyber Media ముంబై నగరంలో నిర్వహించిన INDIA' BRAND ICON -2022 గాను బెస్ట్ 3D అనిమేషన్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు.. ఈ అవార్డ్ ను ప్రముఖ బాలీవుడ్ నటి లారదత్త గారి చేతుల మీదుగా అందుకున్నారు.