For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. విజువల్ ట్రీట్ లా వుంటుంది : హీరో జైద్ ఖాన్ ఇంటర్వ్యూ

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ   విజువల్ ట్రీట్ లా వుంటుంది   హీరో జైద్ ఖాన్ ఇంటర్వ్యూ
Advertisement

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరో జైద్ ఖాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

'బనారస్' ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ?

Advertisement GKSC

దాదాపు దేశం మొత్తం కవర్ చేశాం. ముంబై, పూణే,  ఢిల్లీ, లక్నో, బనారస్, గురజాత్, ఆంధ్రా, తెలంగాణ, కలకత్తా, తమిళనాడు.. ఇలా దేశం అంతా తిరిగాం. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ ఈవెంట్ లో వచ్చిన రెస్పాన్ చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు చూపిన అభిమానాని కి కృతజ్ఞతలు. అలాగే లక్నో లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Zaid Khan, Jayathirtha, NK Productions Pan India Movie 'Banaras' Video Song Released 'Tholi Tholi Valape',Telugu Golden TV,v9 news telugu,,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.com

బనారస్ కి ముందు ఎవరైనా మిమ్మల్ని కలిశారా ?

నాంది సతీష్ గారు ఒక తెలుగు సినిమా చేద్దామని కలిశారు. అయితే అప్పటికి నేను ఇంకా రెడీగా లేను. ఒక కోర్స్ ట్రైనింగ్ లో వున్నాను. అలాగే హిందీ నుండి కూడా రెండు అవకాశాలు వచ్చాయి. అయితే నా ద్రుష్టి సౌత్ సినిమాపైనే వుంది.

బనారస్ ని మీరే ఎంచుకున్నారా ? దర్శకుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ?

బనారస్ ఛాయిస్ నాదే. నేనే దర్శకుడు జయతీర్ధని అప్రోచ్ అయ్యాను. చాలా కాలం నుండి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కోసం ఎదురుచూశాను. ఫైనల్ గా బనారస్ తోజయతీర్ధ గారు వచ్చారు. అలా మా ప్రయాణం మొదలైయింది.

కెజియఫ్, కాంతార సినిమాల విజయాలతో కన్నడ సినిమా పరిశ్రమపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు బనారస్ వస్తోంది. ఈ విషయంలో ఏమైనా ఒత్తిడి ఫీలౌతున్నారా ? 

ఒత్తిడి కాదు కానీ భాద్యత వుంటుంది. నేను కొత్త కావచ్చు కానీ పాన్ ఇండియా అనేది చిన్న విషయం కాదు. మా నిర్మాతలకు ముందే చెప్పాను. కెజియఫ్, కాంతార తో కన్నడ సినిమా ఒక గొప్ప స్థాయిని సంపాదించుకుంది. ఈ విషయంలో నాకు చాలా ఆనందం వుంటుంది. కన్నడ నుండి మరో పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఒక స్థాయిలో వుండాలి. బనారస్ ని అన్ని భాషల పంపిణీదారులకు చూపించాం. వాళ్ళంతా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులని అలరిస్తోందని అభిప్రాయపడిన తర్వాతే పాన్ ఇండియా విడుదలని నిర్ణయించాం.

'Banaras' Mysterious Love Story.. Complete Entertainment Package, 'Banaras' Film Unit,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.com,v9 news telugu

బనారస్ విజువల్స్ చూస్తుంటే బాలీవుడ్ మూవీ లా  కనిపిస్తుంది ?

విజువల్స్ పై నేను ప్రత్యేక ద్యాస పెట్టాను. సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ కి ఒక చిన్న చూపు వుండేది. సౌత్ సినిమాల్లో క్యాలిటీ వుందని వారు అభిప్రాయ పడేవారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకొని బనారస్ ని చాలా గ్రాండ్ గా ఎక్కడా రాజీ పడకుండా బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు ఎందులోనూ తక్కువ కాదని తెలియజేశాలా బనారస్ ని చిత్రీకరించాం. ప్రస్తుతం సౌత్ పరిశ్రమ గొప్ప స్థితిలో వుంది.

బనారస్ నేపధ్యంలో సినిమా చేయడానికి కారణం ?

బనారస్ కంటెంట్ లో  ఒక మిస్ట్రీరియస్, డార్క్  ఎలిమెంట్ వుంది. దానికి బనారస్ నేపధ్యం  ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాగ్డ్రాప్ .. రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. బనారస్ మిస్టీరియస్  లవ్ స్టొరీ. 85శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. ప్రేక్షకు లకి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో టైం ట్రావెల్ కూడా వుంటుంది. అయితే అది కథలో కొంత భాగమే.

ఇది మీ మొదటి సినిమా కదా.. ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?

మనకి ఏదైనా కావాలంటే దాని కోసం మనమే నిలబడాలి. అలాగే జీవితం చాలా చిన్నది. అందరితో ప్రేమగా వుండి నలుగురికి సాయపడటమే జీవితం. ఈ రెండు విషయాలు బనారస్ నుండి నేర్చుకున్నాను.

బనారస్ ని ఎంచుకుకోవడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏమిటి ?

సెకండ్ హాఫ్ లో చేసిన ఒక ప్రయోగం. ఆ ప్రయోగం విజయవంతమౌతుందనే నమ్మకం వుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా మంచి రివ్యూలు ఇచ్చారు. నవంబర్ 4న ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చుశామనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఒకసారి బనారస్ వెళ్లానని అనుకుంటారు.

'బనారస్' ఆలస్యం అవ్వడానికి కారణం ?

2019 సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టాం. అయితే అదే సమయంలో వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. రెండో లాక్ డౌన్ తర్వాత  మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టింది. అన్ని భాషల్లో డబ్బింగ్, పాటలు రిక్రియేషన్ చేశాం. ఐదింతల పని ఎక్కువైయింది. సినిమా పూర్తి చేసిన తర్వాత అన్ని పరిశ్రమల నుండి స్నేహితులు, పంపిణీదారులని పిలిచి చూపించారు. అందరూ యునానిమస్ గా బనారస్ పాన్ ఇండియా కంటెంట్ అని అభిప్రాయపడిన తర్వాతే విడుదలకు సిద్దమయ్యాం.బనారస్ ఒక విజువల్ ట్రీట్ లా వుంటుంది.

సినీ, రాజకీయ నేపధ్యం నుండి వచ్చిన వారికీ అదనంగా కొంత ఒత్తిడి వుంటుంది కదా .. మీ విషయంలో ఎలా వుంది?

ఖచ్చితంగా వుంటుంది. అప్పటికే ఒక ఇమేజ్ వుంటుంది. ఎలా చేసిన అంచనాలని అందుకోవడం ఒక సవాల్ తో కూడుకున్నది. నా విషయంలో కూడా అలాంటి సవాళ్ళు  వున్నాయి. అయితే వాటిని మ్యానేజ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నాన్న గారు ప్రిరిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి, నా గురించి గొప్పగా మాట్లాడటం అనందంగా వుంది.

Zaid Khan, Jayathirtha, NK Productions Pan India Movie 'Banaras' Trailer Grand Release,Telugu Golden TV,www.teluguworldnow.com,My Mix Et,v9 news telugu,telugu world news

టాలీవుడ్ లో మీ శ్రేయోభిలాషులు ఎవరు ?

ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ గారు పర్శనల్ గా తెలుసు. చిరంజీవి గారు కూడా తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు.

పొలిటికల్ డ్రామాలపై ఆసక్తి ఉందా ?

లేదు. రియల్ లైఫ్ లో అవే చూస్తున్నా(నవ్వుతూ) రీల్ లైఫ్ లో అవే చేయడంలో కిక్ లేదు.

కొత్త చేయబోతున్నా చిత్రాలు ?

నాలుగు ప్రాజెక్ట్స్ వున్నాయి. బనరాస్ విడుదల తర్వాత ఒకొక్కటిగా చేయాలి. ప్రేమకథలు ఎక్కువగా చేయాలని వుంది.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Advertisement
Author Image