Balakrishna : బాలయ్య అన్‌స్టాపబుల్ షో నెక్స్ట్ ఎపిసోడ్ గెస్ట్ లు వీళ్ళేనా..!
Balakrishna : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆహా ఓటిటి వేదికగా ప్రసారం అవుతున్న ఈ టాక్ షో మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో... సీజన్ 2ను మొదలుపెట్టింది. ఈ సీజన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేశ్‌తో బాలయ్య ముచ్చట్లు బాగా వైరల్ అయ్యాయి. ఇక రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ... మూడో ఎపిసోడ్‌లో శర్వానంద్, అడివి శేష్ అతిథులుగా వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఎపిసోడ్ 4లో రాబోయే గెస్ట్ లు ఎవరు రివీల్ చేశారు.
ఇప్పుడు నాలుగో ఎపిసోడ్‌లో తన స్నేహితులతో బాలయ్య ముచ్చట్లు పెట్టబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ఎపిసోడ్... ఈనెల 18 నుంచి ఆహాలో అందుబాటు లోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అలానే ఫ్రెండ్స్ కలిసినప్పుడు కన్వర్జేషన్స్‌కి అంతే ఉండదు. ఈ ముగ్గురి ముచ్చట్లు, మెమొరీస్ ఎపిసోడ్ 4లో... అని ఆహా ట్వీట్‌లో రాసుకొచ్చారు. బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి క్లాస్‌మేట్స్ కాగా... బాలకృష్ణ వీరికి ఒక ఏడాది సీనియర్. కానీ, వీరంతా ఒక బ్యాచ్‌లా ఉండేవారు. కలిసి క్రికెట్ ఆడేవారు. ముఖ్యంగా బాలకృష్ణతో కిరణ్ కుమార్ రెడ్డి చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.
Friends kalisinappudu conversations ki anthu eh undadu! Ee mugguri muchatlu, memories Episode 4 lo🤩#UnstoppablewithNBKS2
Premieres Nov 18.#NBKOnAHA #NandamuriBalakrishna#MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india @BigCMobilesIND pic.twitter.com/Fv72qnsSEQ— ahavideoin (@ahavideoIN) November 15, 2022