For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : బాలకృష్ణ షో కు కమల్ హాసన్ ఎప్పుడంటే.. !

07:59 PM Jan 04, 2023 IST | Sowmya
Updated At - 07:59 PM Jan 04, 2023 IST
entertainment   బాలకృష్ణ షో కు కమల్ హాసన్ ఎప్పుడంటే
Advertisement

Entertainment ప్రస్తుతం ఆ హలో ప్రసారమవుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ టు ఎంతగా ప్రాముఖ్యత సంతరించుకుందో అందరికీ తెలిసిందే.. బాలకృష్ణ తన మాటలతో చేతలతో అభిమానుల్ని ఆకట్టుకుంటూనే వస్తున్నారు.. అయితే ఈ ఈ షో కి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వచ్చి తమదైన వినోదాన్ని పంచారు అయితే తాజాగా తమిళ స్టార్ హీరో కమలహాసన్ రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు ఇప్పటికే ఎందరో టాలీవుడ్ ప్రముఖులు వచ్చి తమదైన శైలిలో వినోదాన్ని పంచారు తాజాగా ప్రభాస్ గోపీచంద్ వచ్చి తమదైన శైలిలో ఆడి పాడారు.. అలాగే నిర్మాత అల్లు అరవింద్ దగ్గుపాటి సురేష్ బాబు దర్శకుడు రాఘవేంద్రరావు సైతం ఈ షోకు వచ్చి తమదైన శైలిలో వినోదాన్ని పంచారు.. అలాగే ప్రస్తుతం బాలకృష్ణ శృతిహాసన్తో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో శృతిహాసన్ తన తండ్రి కమల్ హాసన్ తో కలిసి ఈ షోకు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement GKSC

అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ షోకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఇంకా పబ్లిష్ కాలేదు దీనిని సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది అలాగే ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ల పైన ఫోకస్ పెట్టిన అన్ స్టాపబుల్ ఇప్పుడు కోలీవుడ్ పైన కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరింతమంది ప్రముఖులను త్వరలోనే పిలవబోతున్నట్టు సమాచారం ఈ షో మాత్రం మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది.. అయితే దీనిపై ఇంకా అధికారం ప్రకటన రావాల్సి ఉంది..

Advertisement
Author Image