For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు అందుకున్న ‘ఆజాద్ ఫౌండేషన్’ : రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్

02:11 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:11 PM May 11, 2024 IST
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు అందుకున్న ‘ఆజాద్ ఫౌండేషన్’   రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్
Advertisement

ఎలాంటి శిక్షణ, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. విలన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ విలన్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన ఆజాద్ ఇప్పుడు తమిళ్‌, భోజ్‌పురి సినిమాలలో హీరోగానూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇదంతా ఈ రియల్ స్టార్‌లోని ఒక కోణం అయితే.. సమాజానికి సేవ చేయాలనే ధృడ సంకల్పంతో ఆయన ఆజాద్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆజాద్ ఫౌండేషన్ గురించి తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా అఫ్సర్ ఆజాద్‌ని అభినందించడం విశేషం.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయని మర్యాదపూర్వకంగా తన ఆజాద్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి వెళ్లి అఫ్సర్ ఆజాద్ కలిశారు. బండారు దత్తాత్రేయ నివాసంలో జరిగిన ఈ మీట్‌లో ఆజాద్ పౌండేషన్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేన్సర్ బాధితులకు, వయోవృద్దులు అఫ్సర్ ఆజాద్ అందిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు.. అలాగే ఉత్తరాఖండ్ చమోలి దుర్ఘటనకు స్పందించి సేవలందిస్తున్న తీరును గమనించిన ఆయన.. ఆజాద్ ఫౌండేషన్‌ను మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా.. ఈ సంస్థకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. గవర్నర్ అభినందనలు అందుకున్న ఆజాద్ పౌండేషన్ టీమ్.. ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో.. తమ సంస్థను ముందుకు తీసుకువెళతామని పేర్కొన్నారు. ‘ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, శివకాశి, రాజాబాబు, అధినేత, శ్రీమన్నారాయణ, అధినాయకుడు, రాధ, రుద్ర ఐపీఎస్’ వంటి చిత్రాలలో విలన్‌గా మెయిన్ లీడ్ పాత్రలు చేసిన ఆజాద్.. పవన్ కళ్యాణ్ ‘గుబుంబా శంకర్’ చిత్రంలో మెయిన్ విలన్‌కు రైట్ హ్యాండ్‌గా చేశారు.

Advertisement GKSC

Advertisement
Author Image