For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#AB8 : అశ్విన్ బాబు, షణ్ముఖ పిక్చర్స్ #AB8 టైటిల్ 'వచ్చినవాడు గౌతం'

09:07 PM Aug 01, 2023 IST | Sowmya
Updated At - 09:07 PM Aug 01, 2023 IST
 ab8   అశ్విన్ బాబు  షణ్ముఖ పిక్చర్స్  ab8 టైటిల్  వచ్చినవాడు గౌతం
Advertisement

యూనిక్  థ్రిల్లర్ ‘హిడింబ’లో తన అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ నటనతో అందరినీ సర్ ప్రైజ్ చేసిన  ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. అశ్విన్ బాబు 8వ చిత్రం #AB8 మామిడాల ఎం ఆర్ కృష్ణ  దర్సకత్వంలో ఈరోజు అనౌన్స్ చేశారు.  షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు.

అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా  ఈ చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. మెడికో థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్ స్టెతస్కోప్ పట్టుకున్న హీరో చేతిని చూపిస్తుంది. అతని ముఖాన్నిచేయి కవర్ చేస్తోంది. చేతి నుండి రక్తం కారుతోంది.

Advertisement GKSC

కథనంలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండే సినిమా కోసం అశ్విన్ బాబు ఫిజికల్ గా మేకోవర్ అయ్యారు. గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్  యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా , అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో  తెలియజేస్తారు.

ఇవి కూడా చదవండి : -  అచ్చ తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల పుట్టిన రోజు ఈ ఏడాది ఎంతో స్పెషల్

Chandramukhi 2 : ఫస్ట్ లుక్‌ లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా ఉంటాడో ?

ఉస్తాద్ రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్‌’ నుంచి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బిగ్ బుల్‌ ఫస్ట్ లుక్

తారాగణం : అశ్విన్ బాబు

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: మామిడాల ఎంఆర్ కృష్ణ
నిర్మాత: ఆలూరి సురేష్
బ్యానర్: షణ్ముఖ పిక్చర్స్
సమర్పణ: ఆలూరి హర్షవర్ధన్ చౌదరి
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: గౌర హరి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
డైలాగ్స్: అబ్బూరి రవి
సాహిత్యం: భాస్కర భట్ల - శ్రీమణి
పబ్లిసిటీ: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ - శేఖర్

Advertisement
Author Image