For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆశిష్, కాశీ విశాల్ ‘సెల్ఫిష్’ హైదరాబాద్‌లో షూటింగ్

07:22 AM Jul 20, 2023 IST | Sowmya
Updated At - 07:22 AM Jul 20, 2023 IST
ఆశిష్  కాశీ విశాల్ ‘సెల్ఫిష్’ హైదరాబాద్‌లో షూటింగ్
Advertisement

తొలి చిత్రం 'రౌడీ బాయ్స్'తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్, ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు , శిరీష్  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మిస్తున్న క్రేజీ యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్‌’ లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కాశీ విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సెల్ఫిష్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ వీధుల్లో జరుగుతోంది. ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. వర్కింగ్ స్టిల్స్ లో ఆశిష్ ట్రెండీ లుక్‌లో కనిపించగా, ఇవానా గ్లాసెస్ తో కూల్‌గా కనిపిస్తుంది.

Advertisement GKSC

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాట దిల్ కుష్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

Advertisement
Author Image