For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆర్య-గౌతమ్ కార్తీక్ పాన్ ఇండియన్ మూవీ 'మిస్టర్. X' లో సుప్రీం స్టార్ శరత్ కుమార్

10:30 PM Jul 28, 2023 IST | Sowmya
Updated At - 10:30 PM Jul 28, 2023 IST
ఆర్య గౌతమ్ కార్తీక్ పాన్ ఇండియన్ మూవీ  మిస్టర్  x  లో సుప్రీం స్టార్ శరత్ కుమార్
Advertisement

స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలలో మను ఆనంద్  దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. ప్రముఖ నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్  కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సుప్రీం స్టార్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో స్టైలిష్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు శరత్ కుమార్.

Advertisement GKSC

హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "మిస్టర్ X” యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.

Latest Vijaya Devarakonda Kushi Teaser - Check Now

రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, ఇందులాల్ కవీద్ ఆర్ట్ డైరెక్టర్. కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తరా మీనన్. ఏపీ పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్,  శ్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిస్టర్ X చిత్రానికి ఎ. వెంకటేష్ సహ నిర్మాత.

మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Advertisement
Author Image