For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: శ్రీ విష్ణు హీరో అనాలో, ఆర్టిస్ట్ అనాలో, యాక్టర్ అనాలో నాకు తెలియదు కానీ ?: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు

10:08 PM Dec 30, 2021 IST | Sowmya
Updated At - 10:08 PM Dec 30, 2021 IST
film news  శ్రీ విష్ణు హీరో అనాలో  ఆర్టిస్ట్ అనాలో  యాక్టర్ అనాలో నాకు తెలియదు కానీ    ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు
Advertisement

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన‌ చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహించారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. నిరంజన్, అన్వేష్‌లు సినిమా మీద ఫ్యాషన్‌తో 2008 లో మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ స్టార్ట్ చేశారు. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ సినిమాలు చేస్తానో వాళ్లు కూడా సేమ్ రూట్‌. ఒక్క క్షణం, ఘాజీ.. ఇప్పుడు అర్జుణ ఫల్గుణ ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. నిరంజన్, అన్వేష్‌లకు ఆల్ ది బెస్ట్. మనం ఎన్ని సక్సెస్‌లు తీస్తామో తెలియదు.. కానీ ప్రయత్నం చేస్తు వెళ్తుంటే సక్సెస్ వస్తుందని నమ్ముతాను. దాన్నే వాళ్లు కూడా నమ్ముతూ ఇలాగే డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు. అర్జున మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.

Advertisement GKSC

శ్రీ విష్ణు హీరో అనాలో, ఆర్టిస్ట్ అనాలో, యాక్టర్ అనాలో నాకు తెలియదు. కానీ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాం. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నం చేస్తూ.. తన ఫర్ఫామెన్స్‌తో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నాడు. చేస్తు ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్‌లు వస్తాయి. ఎందరో నీ ముందు ఎగ్జామ్‌ఫుల్‌గా ఉన్నారు. ఏదో ఒక రోజు నీ ప్రయత్నం నిన్ను పెద్ద వాడిని చేస్తుంది. ప్రయత్నం ఆపకు. తేజ జోహర్ సినిమా చూశాను.. ఆల్ ది బెస్ట్. నాకు కొత్త డైరెక్టర్లు కథ చెబితే రెండు మూడు విష్ణుతో షేర్ చేశాను. బెక్కం గోపి సినిమా చేస్తున్నాడు. మా బ్యానర్‌లో కూడా సినిమా చేయబోతున్నాడు.Arjuna Phalguna Movie Going to Big Hit Dil Raju in Pre Release Event,Director Teja Marni,Hero Sri Vishnu Amritha Aiyer,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1

Advertisement
Author Image