Politics : కొత్త ఏడాది నుంచి పెన్షన్ పెంపుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం..
Politics తాజాగా సమావేశమైన ఏపీ క్యాబినెట్ పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. వచ్చే ఏడాది నుంచి ఈ నిర్ణయం అమలు కానున్నట్టు తెలిపింది..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది... జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ పెన్షన్‌పై, వర్చువల్ క్లాసులపై సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలను తీసుకుంది.. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు నిర్వహించాలని తీర్మానించింది..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది... ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. అలాగే వచ్చేయాడాది కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుందని తెలిపారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2006 ఏప్రిల్ 1వ తేదీన పింఛన్‌ను రూ.75 నుంచి రూ.200కు పెంచారు. 2008లో ఒకే ఏడాది ఏకంగా 23 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అలాగే ఈ సమావేశంలో వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.