Entertainment : విరుష్క బంధానికి ఐదేళ్లు పూర్తి ఎమోషనల్ పోస్ట్ ను ఉంచిన స్టార్ హీరోయిన్..
Entertainment బాలీవుడ్ స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు ఉంచారు..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటి తో ఐదేళ్లు పూర్తయ్యాయి. వీరిద్దరు ఐదేళ్ల క్రితం డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అలాగే
2013లో ఓ షాంపు యాడ్‌లో మొదటిసారిగా కలుసుకున్న విరాట్, అనుష్క మంచి స్నేహితులుగా మారారు. ఆతర్వాత స్నేహం కాస్తా ప్రేమగా చిగురించింది.
కొన్నాళ్లపాటు వీరి ప్రేమను రహస్యంగా ఉంచిన తర్వాత ఇరుపెద్దల ఆశీర్వదంతో 2017 డిసెంబరు 11న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారీ లవ్లీకపుల్. ఈ ప్రేమబంధానికి గుర్తింపుగా వామిక అనే కూతురు విరుష్క ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పటినుంచి ఎంత అన్యోన్యంగా ఉంటూ వస్తున్న వీరిద్దరూ దాంపత్య జీవితం కోసం ఎప్పటికప్పుడు తెలుపుతూనే వచ్చారుఅయితే ఈరోజు వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా... అనుష్క కి విషెస్ చెబుతూ కోహ్లి ఇన్‌స్టాలో తమ ఇద్దరి రొమాంటిక్ ఫొటోను పంచుకున్నాడు విరాట్. ‘అంతులేని ప్రయాణంలో ఐదేళ్లు గడిచిపోయాయి.. నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. మా మనసంతా నువ్వే. నీపై నా ప్రేమ అజరామరం. నా జీవితంలో నాకు దక్కిన గొప్ప బహుమతి నువ్వే’ అంటూ చెప్పు కొచ్చారు