Politics : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
Politics కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాజాగా భారత్ జడ యాత్రలో భాగంగా భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తత పై మాట్లాడారు అలాగే ఈ విషయంలో భారత్ చాలా అజాగ్రత్తగా ఉంది అంటూ పలు వ్యాఖ్యలు చేశారు అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తప్పుపట్టారు..
మన మీదకి యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత్ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ఉందంటూ రాహుల్ గాంధీ భారతీయుడా యాత్రలో భాగంగా రాజస్థాన్లో పర్యటిస్తూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు అనురాగ్ ఠాకూర్ అంతేకాకుండా ఇలా ఉండటం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
"రాహుల్ గాంధీ ప్రకటనపై ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. డోక్లామ్ సంఘటన జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఆయన ఇలాంటి కామెంట్సే చేశారు. బహుశా రాహుల్ గాంధీకి మన దేశ సైన్యంపై విశ్వాసం లేకపోవచ్చు. ఇది 1962 నాటి భారతదేశం కాదు. ఇది 2014 తరువాతి భారతదేశం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దూసుకుపోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో సైన్యానికి అవసరమైన యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్నో బూట్‌లు కొనలేకపోయింది. సైన్యం కోసం మీరు చేసిందేంటి.. నేడు భారతదేశంలో 300 కంటే ఎక్కువ రక్షణ సామాగ్రి తయారవుతోంది. ఇది స్వావలంబన భారతదేశం. భారత్ ఇప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవడం లేదు.. ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. డోక్లామ్ ఘటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యాన్ని కలిసి వారిలో విశ్వాసాన్ని నింపారు.. " అని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి.