Entertainment : బీచ్ లో హొయలుపోతున్న యాంకర్ వర్షిణి..
Entertainment యాంకర్ వర్షిని తాజాగా బీచ్ లో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇవి చూసిన ఆమె అభిమానులంతా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..
ప్రస్తుతం తెలుగులో బిజీ యాంకర్ లో ఒకరుగా ఉన్నారు యాంకర్ వర్షిని.. ఎప్పుడు బిజీ షెడ్యూల్ షూటింగ్ తో బిజీగా ఉండే ఈమె తాజాగా గోవా బీచ్ లో సాదా తీరారు అలాగే సెలబ్రిటీలో ఎప్పటికప్పుడు షూటింగ్ సమయంలో బ్రేక్ రాగానే విహారయాత్రలకు వెళ్లిపోతూనే ఉంటారు ఈ పని ఒత్తిడి నుండి బయటపడటానికి వాళ్లు ఈ విధంగా ఉంటారు అయితే తాజాగా వర్షిని కూడా ఇలాగే గోవాకు వెళ్ళిన ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది..
ఈ ఫోటోలో వర్షిణి సముద్రపు ఒడ్డున అలలతో సరదాగా ఆడుకుంటూ చిందులేసింది. నులివెచ్చని సూర్యకిరణాల తాకుతూ ఉండగా షాడో అందాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫొటోలను షేర్ చేసుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. సందర్భమేదైనా కామెడీ పంచులు, డైలాగులతో మాటల గారడీ చేయడం ఈ ముద్దుగుమ్మ ట్యాలెంట్. అలాగే ఈమె టీవీ షోలు తో పాటు సినిమాలు వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పిస్తుంది.. మోడల్ గాతన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. పెళ్లిగోల వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకుంది అలాగే రవితేజ హీరోగా వచ్చిన శంభో శివ శంభో సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.. అలాగే లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.