For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: సుమ నటించిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి: రానా దగ్గుబాటి

12:07 AM Dec 13, 2021 IST | Sowmya
Updated At - 12:07 AM Dec 13, 2021 IST
film news  సుమ నటించిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి  రానా దగ్గుబాటి
Advertisement

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో కనిపించబోత్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఆదివారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..

సుమ మాట్లాడుతూ.. ‘మీరు ఈ పాత్రను చేయగలను అని అనుకుంటున్నారా? అని దర్శకుడు అన్నారు. ఆ మాటతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. టీం మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిందే. నేను ఈ సినిమా కోసం ఆ యాసను నేర్చుకున్నాను. కీరవాణి గారు ఒక్క ఫోన్ కాల్‌తో ఈ సినిమాకు ఓకే చెప్పారు. కథ విన్న తరువాత ఆయనకు ఎంతో నచ్చింది. ఒక బాహుబలి.. ఒక ఆర్ఆర్ఆర్.. ఒక జయమ్మ పంచాయతీ. సుమ సినిమా చేస్తోందని నా కోసం చేశారు. ఆయనకు థ్యాంక్స్. మా డీఓపీ అనుష్ కుమార్‌కు ఇది మొదటి సినిమా. ఈ సినిమా కోసం 18 రోజులు అనుకుంటే 40 రోజులు పని చేశాను. అక్కడి లోకేషన్లను అద్భుతంగా చూపించారు. ఇందులో జయమ్మ కథే కాదు. చాలా కథలున్నాయి. వాటితో జయమ్మ సమస్యలు ఎలా కనెక్ట్ అయి ఉంటాయనేది కథ. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ఇది చాలా విభిన్న కథ. మీరంతా నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే. మీకు వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. సుమ వేరు.. జయమ్మ వేరు. నేను కూడా జయమ్మలానే ఉండాలని అనుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత బాగా నిర్మించినందుకు ప్రకాష్ గారికి థ్యాంక్స్. రానా గారి ఫస్ట్ సినిమాకు నేను హోస్ట్ చేశాను. ఇప్పుడు ఆయన నా సినిమాకు గెస్ట్‌గా వచ్చారు. నన్ను యాంకర్‌గా మరిచిపోతారని అన్నారు. అది అదే.. ఇది ఇదే. నేను ఈ స్థాయికి రావడం, ఇలా ఉండటానికి కారణం మా విమలమ్మ. లవ్యూ అమ్మ. థ్యాంక్యూ’ అని అన్నారు.

Advertisement GKSC

Anchor Suma Kanakala As Jayamma Panchayathi Movie Going to Big hit Says Daggubati Rana,Kalivarapu Vijay Kumar,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comరానా మాట్లాడుతూ.. ‘సుమ గారు రానంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు డేట్లు మార్చుకున్న సందర్బాలున్నాయి. సుమ గారు మాట్లాడిన తరువాత మనం మాట్లాడటానికి ఇంకేం ఉండదని తెలిసింది. సినిమా గురించి ఇంత బాగా ఎవ్వరూ వివరించలేరు. ఆమె ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ. ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే అందరూ కంఫర్ట్‌గా ఉంటారు. అందరికీ ప్రేమ పంచే సుమ గారికి మనం ఎంత తిరిగిచ్చినా కూడా తక్కువే. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలి. ఇలానే సినిమాలు చేస్తూ, షోలు చేస్తూ, ఎన్నెన్నో భాషల్లో చేస్తూ ఉండాలి. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Advertisement
Author Image