Entertainment : పొట్టి బట్టల్లో కన్నా సాంప్రదాయ దుస్తుల్లో చూడచక్కగా ఉన్నావు శ్రీముఖి అంటున్న నెటిజన్లు..
Entertainment యాంకర్ శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ అమ్మడి హాట్ ఫోటోలు తెగ హల్చల్ చేస్తూ ఉంటాయి అయితే ఎప్పుడో కానీ సాంప్రదాయంగా కనిపించరు ముఖ్యంగా తన కుటుంబ సమేతంగా సంప్రదాయంగా కనిపిస్తే అది పెద్ద చర్చకే దారితీస్తుంది తాజాగా శ్రీముఖి అలాంటి ఫొటోలే సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ప్రస్తుతం వైరల్ గా మారాయి..
యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి ఆమె తన అమ్మ నాన్న తమ్ముడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులంతా సో క్యూట్ పొట్టి బట్టల్లో కన్నా సాంప్రదాయ దోస్తుల్లో చాలా అందంగా ఉన్నావు శ్రీముఖి అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.. ఈ ఫోటోలో శ్రీముఖి ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని చాలా అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఫ్యామిలీ అంతా ఎల్లో కలర్ డ్రెస్ల్లో చాలా హుందాగా కనిపించారు..
అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా కూడా మంచి జోష్ లో ఉన్నారు శ్రీముఖి.. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిసెస్ అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ కానుంది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్.

