Entertainment : రిషబ్ శెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనసూయ..
Entertainment రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మంచి హిట్ టాక్ను సంపాదించుకుంది అయితే తాజాగా ఈ సినిమా హీరో రిషబ్ శెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ అనసూయ..
కాంతారా హీరో రిషబ్ శెట్టి పై అనసూయ భరద్వాజ్ ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమా ఒక అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.. రిషబ్ శెట్టి ఈ సినిమాలో నమ్మశక్యంకాని రీతిలో యాక్ట్ చేశాడు. ఆ సినిమా ప్రభావం నుంచి నేను వేగంగా బయటికి రాలేకపోయాను.. అని చెప్పుకొచ్చింది అనసూయ..
రిషబ్ శెట్టి ప్రియదర్శకతంలో వచ్చిన ఈ సినిమా కన్నడలో మొదట విడుదలైంది ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలోచించింది తెలుగులో సైతం ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకొని 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచి రూ.400 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.15 కోట్లే కావడం గమనార్హం. కాంతార మూవీలో రిషబ్ శెట్టి నటనకి మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా.. క్లైమాక్స్‌లో ఆ 20 నిమిషాలు రిషబ్ శెట్టి తన నటనతోనే సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లాడు. దాంతో భాషతో సంబంధం లేకుండా సినిమాని అందరూ ఆదరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం సినిమాని చూసి రిషబ్ శెట్టిని పిలిపించుకుని మరీ అభినందించి ఓ గోల్డ్ చైన్‌ని గిప్ట్‌గా ఇచ్చాడు.
అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయింది. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగ మార్తాండ’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ.. సినిమాల కారణంగా ‘బజర్దస్త్’కి కూడా దూరంగా ఉంది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటోంది.