For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Amitabh Bachchan : హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్... ఎందుకంటే !

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
amitabh bachchan   హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్    ఎందుకంటే
Advertisement

Amitabh Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. తనదైన శైలిలో సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు బిగ్‌బి అమితాబ్‌. 80 ఏళ్ల వయసు లోనూ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు అమితాబ్. కేవలం నటుడి గానే కాకుండా హోస్ట్ గా సత్తా చాటుతున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి 14 ద్వారా బుల్లితెర పై కూడా సందడి చేస్తున్నారు బిగ్ బి.

తాజాగా అమితాబ్ బచ్చన్ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం అందుతుంది. తన అనుమతి లేకుండా తన పేరుని, ఫోటోలని, గొంతును ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. బిగ్ బి పిటిషన్ ని విచారించిన ఢిల్లీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అమితాబ్ వ్యక్తిగత హక్కులపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అమితాబ్ అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా, సంస్థ గానీ ఆయన పేరు – ఫొటో లేదా వాయిస్ ని వాడకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement GKSC

అలాగే అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఫ్లాగ్ చేసిన కంటెంట్ ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఇటీవలే అమితాబ్ ఉంచాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement
Author Image